పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రకరకాల కారణాలతో నత్తనడకన నడుస్తోంది. షూటింగ్ విషయంలో అంతూ దరీ లేని డైలెమ్మా కొనసాగుతోందన్నది తాజా అప్ డేట్. ఇప్పటికే దర్శకుడు బాబితో పవన్ పలుమార్లు ఘర్షణ పడ్డారని వార్తలొచ్చాయి.
సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల సినిమా బాగా ఆలస్యమవుతోందంటూ పవన్ ఇప్పటికే దర్శకుడిపైనా, నిర్మాతపైనా ఫైరయ్యారని చెబుతున్నారు. ఆన్‌సెట్స్ ఇలాంటివన్నీ మామూలే అనుకున్నా.. ఇటీవలి కాలంలో షూటింగ్ విషయంలో సరైన ప్లాన్ లేకపోవడం పవన్ ని పూర్తిగా డిసప్పాయింట్ చేసిందని చెబుతున్నారు. ఇటీవలే అవుట్ డోర్ షూటింగ్ పూర్తి చేసుకుని సూదీర్ఘ షెడ్యూల్ ని ముగించారు. అయితే ఈ షెడ్యూల్ లో ల్యాగ్ ఎక్కువైందని పవన్ ఆవేదన చెందారుట. మరీ ఎక్కువ సమయం పడుతోంది. ఇలా అయితే కష్టం అని ఆయన అభిప్రాయపడ్డారని చెబుతున్నారు. అయితే అసలు ఆన్ సెట్స్ ఏం జరుగుతోంది? బాబిలో క్లారిటీ మిస్సయ్యిందా? లేదూ పవన్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా? అన్నది తెలియాల్సి ఉందింకా.
వాస్తవానికి పవన్ పెర్ఫెక్షనిస్ట్. ప్రతిదీ ప్రణాళికా బద్ధంగా జరగాలని అనుకుంటారాయన. అతడు ఆశించినట్టే అన్నీ జరగకపోవడం వల్లనే ఇలా జరుగుతోందా? ఎందుకీ డైలెమ్మా? కీలకమైన షెడ్యూల్ లో బాబి ఎందుకు ఏమరుపాటుగా ఉన్నాడు? అన్నది తేలాల్సి ఉంది.