మధ్యలో ఓ రెండు మూడేళ్ల పాటు తన అన్నయ్య చిరంజీవికి.. మిగతా మెగా ఫ్యామిలీకి దూరం దూరంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఏదైనా కార్యక్రమాల్లో చిరు గురించి ప్రస్తావించడానికి కూడా ఇష్టం లేనట్లుగా వ్యవహరించాడు పవన్. కానీ గత ఏడాది ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుక దగ్గర్నుంచి పవన్ లో మార్పు కనిపిస్తోంది. ఆ సినిమా ఆడియో వేడుకకు అన్నయ్యను ముఖ్య అతిథిగా ఆహ్వానించడమే కాక.. ఆయన గురించి గొప్పగా మాట్లాడాడు పవన్. ఆ తర్వాత పలు సందర్భాల్లో చిరును పొగిడాడు పవన్. ఇటీవలే తన రాజకీయ పర్యటనలో అన్నయ్యపై అంతులేని అభిమానాన్ని చాటుకున్నాడు. దీంతో చిరుపై పవన్ ప్రేమ ఎలాంటిదో అందరికీ అర్థమైంది.
ఇదిలా ఉంటే పవన్ కొత్త సినిమా ‘అజ్ఞాతవాసి’కి సంబంధించి బయటికి వచ్చిన ఒక పోస్టర్లో పవన్ మెడలో ఉన్న లాకెట్ విషయమై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అందులోని పెండెంట్ మీద ఆంజనేయుడి చిత్రం కనిపిస్తోంది. అది రామ్ చరణ్ మొదలుపెట్టిన నిర్మాణ సంస్థ ‘కొణిదెల ప్రొడక్షన్స్’ లోగోలో కనిపించే ఆంజనేయుడి చిత్రమే కావడం విశేషం. ఇది చూసి మెగా అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. తన అన్న సంస్థకు చెందిన లోగో ముఖచిత్రంతో లాకెట్ చేయించుకుని పవన్ మెడలో వేసుకోవడం ద్వారా అభిమానులకు పవన్ ఎలాంటి సంకేతాలిస్తున్నాడో వేరే చెప్పేదేముంది..? చిరు-పవన్ మధ్య విభేదాలని.. వాళ్ల మధ్య దూరం పెరిగిపోయిందని.. ఇప్పటిదాకా జరిగిన ప్రచారాలకు ఇంతటితో తెరదించేయొచ్చేమో.