ఫ్యాన్స్‌ పాడుచేస్తే.. పవన్‌ కట్టిస్తున్నాడు

Update: 2015-09-11 14:43 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు రాత్రి భీమవరం అట్టుడికిపోయింది. ప్రభాస్, పవన్ ఫ్యాన్స్ గ్రూపుల ఘర్షణల కారణంగా..  ఆ టౌన్ దద్దరిల్లిపోయింది. పవర్ స్టార్ బర్త్ డే కటౌట్లను ప్రభాస్ అభిమానులు తొలగించడంతో.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు.

ఇప్పుడు భీమవరంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసే బాధ్యత తనపై వేసుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రైవేటు వ్యక్తులకు జరిగిన ఆస్తి నష్టాన్ని.. స్వంత ఖర్చులతో రిపేర్ లు చేయించేస్తున్నారు పవన్. అంతే కాదు.. అప్పడు పెట్టిన కేసుల కారణంగా జైలు పాలయిన 10మందిని తనే పోలీస్ కస్టడీ నుంచి విడిపించారట కూడా.

ఇప్పటికే పవన్, ప్రభాస్ లు.. ఈ దాడులను ఖండించారు. అభిమానులకు హితవు పలికారు. ఇప్పుడు స్వయంగా జరిగిన నష్టానికి.. పవర్ స్టారే పరిహారం కట్టుకుంటున్నారు. అటు అభిమానులను, ఇటు భీమవరం జనాలని శాంతపరచి.. తన మార్క్ చూపించారు అభిమానుల పవర్ స్టార్. అందుకే ఈయన జనానికి జనసేనాని అయ్యారు.
Tags:    

Similar News