బాబీ ఫస్టు సినిమా చూడలేదు -పవన్‌

Update: 2016-04-07 11:30 GMT
కె.ఎస్‌.రవీంద్ర ఎలియాస్‌ బాబీ. అప్పట్లో రైటర్‌గా చాలా సినిమాలకు పని చేశాడు. ఆ తరువాత రవితేజతో ''పవర్‌'' సినిమాతో వెలుగులోకి వచ్చాడు. సినిమా కథ పాతదే అయినా కూడా.. ఇతగాడి ప్రెజంటేషన్‌ స్టయిల్‌ అందరికీ నచ్చింది. మరి రెండో సినిమా ఎవరితో చేస్తాడా అనుకుంటే.. మనోడు ఏకంగా పవన్‌ కళ్యాణ్‌ తో ''సర్దార్‌'' సినిమాను చేస్తున్నాడు. ఇంతకీ పవన్‌ ఏం చూసి మనోడికి ఛాన్సిచ్చాడు.

''ఒక వ్యక్తితో మనం పని చేయొచ్చా లేదా అనేది నేను ఓ రెండు నిమిషాల్లో కనిపెట్టేస్తాను. బాబీ మొదటి సినిమాను నేను చూడలేదు కాని.. తన టాలెంట్‌ గురించి విన్నప్పుడు కలుద్దాం అనిపించింది. ఇక కలిసిన వెంటనే.. ఇతగాడితో సినిమా చేయొచ్చు అనిపించింది. నా కెరియర్‌ లో అలా ఎవరితోనైతే నేను రెండో నిమిషంలోనే కనెక్ట్‌ అవుతానో.. వాళ్ళతోనే నేను సినిమాలు చేశాను'' అని ఒక ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు పవన్‌ కళ్యాణ్‌.

తాను తీసిన తొలి సినిమా చూడకుండానే.. బాబీకి రెండో సినిమా పవన్‌ కళ్యాణ్‌ తో పడటం అనేది పెద్ద విషయమే. ఇకపోతే ఈ సినిమాను మనోడు ఎలా తీశాడు.. పవన్‌ రాసిన కతకు న్యాయం చేస్తూ.. అభిమానులను ఏ రేంజులో అలరించాడనేది రేపు తెలుస్తుంది.
Tags:    

Similar News