ఇటీవల తెలుగు సినిమా జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంటోంది. బాహుబలి సిరీస్ తర్వాత పలు బాలీవుడ్ సినిమాలతో పాటు టాలీవుడ్ సినిమాలు ప్రపంచ దేశాల్లో రిలీజవుతూ మన గొప్పతనాన్ని.. గౌరవాన్ని చాటి చెబుతున్నాయి. ఇక ఇదే ఒరవడిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలోని ఓ పాటకు అంతర్జాతీయ గుర్తింపు దక్కడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. అందుకు `వరల్డ్ ఆఫ్ డ్యాన్స్` అనే అంతర్జాతీయ డ్యాన్స్ రియాలిటీ షో వేదిక అయ్యింది.
ముంబైకి చెందిన ప్రముఖ డ్యాన్స్ గ్రూప్ `ది కింగ్స్` ఈ డ్యాన్స్ రియాలిటీ షోలో విజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో ది కింగ్స్ బృందాన్ని పవన్ కల్యాణ్ `సర్ధార్ గబ్బర్ సింగ్` పాట విన్నర్ గా నిలిపింది. జెన్నీఫర్ లోపేజ్, నీయో, డెరెక్ హూగ్ వంటి జడ్జీలు మన డ్యాన్సర్స్ పెర్ఫామెన్స్‌కు ఫిదా అయ్యి వారిని అభినందించారు. అభినందన ఒక్కటే కాదు.. ఒక రెజియనల్ పాటను ఎంచుకుని పెర్ఫామ్ చేసిన విషయాన్ని వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా రివీల్ చేసింది.
పవన్ - సర్ధార్ గబ్బర్ సింగ్ పాటకు అంతర్జాతయ గుర్తింపు దక్కింది. దీంతో ఈ పాటకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. దానిపై అతడు స్వయంగా స్పందించారు. అమెరికన్ పాపులర్ షోలో ఓ డ్యాన్స్ గ్రూప్ తను కంపోజ్ చేసిన `ఖైదీ నంబర్ 150` చిత్రంలో `సుందరి..` పాటకు పెర్ఫామ్ చేసిన సంగతి గుర్తొచ్చిందని అన్నారు. నా సంగీతం ప్రజల్ని డ్యాన్స్ చేయించడం చాలా ఆనందంగా ఉంది. ఎంతో చక్కగా డ్యాన్స్ చేశారు. కీప్ రాకింగ్స్``` అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ రియాలిటీ షోలో విన్నర్స్ టీమ్ ఎంత ప్రైజ్ మనీ గెలుచుకుందో తెలుసా? 10 లక్షల డాలర్లు (1 మిలియన్ డాలర్) బహుమానంగా నిలిచింది.
Full View