భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ పాట

Update: 2021-12-04 10:30 GMT
త‌న సినిమాల్లో పాట‌లు పాడ‌డం ప‌వ‌న్ కి కొత్తేమీ కాదు కానీ.. ఇటీవ‌లి కాలంలో అతడి గానం వినే అవ‌కాశం అదృష్టం అభిమానుల‌కు లేకుండా పోయింది. కానీ ఆ లోటును తీర్చేందుకు భీమ్లా నాయ‌క్ లో స్కోప్ ఉంద‌ని స‌మాచారం. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాటకు తన గాత్రాన్ని అందిస్తున్నాడు. ఎస్.ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ పాట చార్ట్ బస్టర్ గా నిల‌వ‌నుంది.

భీమ్లా నాయక్ వెండితెరపైకి రావడానికి రెండ్రోజుల ముందు ఈ పాటను విడుదల చేయనున్నారు. ఇది సినిమాలో కీలకమైన స‌న్నివేశంలో వస్తుంది. భీమ్లా నాయక్ జనవరి 12న విడుదల కానుంది. అంత‌కుముందే ప్ర‌చారం ప‌రంగా బోలెడంత హంగామా నెల‌కొంది. భీమ్లా నాయ‌క్ టీజ‌ర్లు ఆక‌ట్టుకున్నాయి. ట్రైల‌ర్ కోసం అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

రానా ఈ చిత్రంలో డేనియ‌ల్ శేఖ‌ర్ అనే పాత్రలో నటిస్తున్నారు. డేనియ‌ల్ వ‌ర్సెస్ భీమ్లా నాయ‌క్ ఎమోష‌న‌ల్ ఎపిసోడ్స్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నున్నాయి. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండ‌గా..త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌కుడిగా ఉన్నారు.


Tags:    

Similar News