గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ వివాహం అనంతరం అమెరికాలో స్థిరపడిన సంగతి తెలిసిందే. ఈ జంట దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టి మూడేళ్లు దాటింది. వీళ్లిద్దరి అన్యోన్యత గురించి చెప్పాల్సిన పనిలేదు. దేశాలు వేరైనా..మతాలు వేరైనా ఆ జంట అన్యోన్యత మాత్రం చూడ మచ్చటగా ఉంటుంది. ప్రేమలో కొలమానాలు ఉండవు అని చెప్పడానికి ఈ జంటని ఉదహరించొచ్చు. ఇంకా చెప్పాలంటే నిక్ అంటే పీసీకి ప్రాణం. ఇలా ఈ జంట వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది. కెరీర్ పరంగానూ ఎవరి బిజీలో వారు ఉన్నారు. అప్పుడప్పుడు ముంబై వచ్చి వెళ్తుంటారు.
చాలా రేర్ గా మాత్రమే పీసీ బాలీవుడ్ సినిమాలు కమిట్ అవుతోంది. మరి ఈ జంట ఇంకా పిల్లల్ని ప్లాన్ చేయాలేదా? అంటే ఆ ప్రశ్నకి తాజాగా పీసీ సమాధానం చెప్పింది. వానిటి ఫెయిర్ చాటింగ్ లో పిల్లల ప్రస్తావన రావడంతో పీసీ ఎలాంటి దాపరికాలు లేకుండా తన ప్రణాళికలు ఎలా ఉన్నాయన్నది చెప్పింది. ``పిల్లలు అనే కోరిక జీవితంలో అతి పెద్ద భాగం. దేవుడి దయతో అది జరిగినప్పుడు జరుగుతుంది అని పీసీ తెలిపింది. అలాగే పిల్లలు కలిగి తర్వాత పనిలో ఒత్తిడి..వేగం తగ్గించుకుంటారా? అని ప్రశ్నిచంగా అందుకు ప్రియాంక చోప్రా..నిక్ జానాస్ తప్పకుండా.. పిల్లల కంటే వేరే ప్రపంచం ఏముంటుందని బదులిచ్చారు. అలాగే నటిగా ఈ ఏడాది మాత్రం అంత బిజీగా ఉండటం ఇష్టం లేదు.
ఇంటి దగ్గర కుటుంబంతోనే ఎక్కువ సమయంగా గడపాలని ఉందని పీసీ తెలిపింది. అలాగే నిక్ కూడా ప్రియాంక పేరు ప్రఖ్యాతల్ని సద్వినియోగం చేసుకునే ఆలోచనలో లేనని... తాను ఎప్పుడూ స్వయంకృషితోనే ఎదగాలని భావిస్తున్నట్లు నిక్ తెలిపాడు. ఇద్దరం కొన్ని కండీషన్లు.. హద్దులు ఏర్పరుచుకుని జీవితంలో ముందుకు వెళ్తున్నామని నిక్ తెలిపాడు. అందుకు ఇరు కుటుంబాలు కూడా ఎంతో సహకరిస్తున్నాయని.. ఎలాంటి ఒత్తిడికి గురి కావడం లేదని పేర్కొన్నాడు.