టీజ‌ర్ టాక్: `పెంగ్విన్` ఒక‌ గ‌ర్భిణి ఆక్రంధ‌న క‌థ‌

Update: 2020-06-08 06:37 GMT
పెద్ద తెర అయినా.. ఓటీటీ అయినా క్రైమ్ థ్రిల్ల‌ర్లు.. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీల‌కు ఉండే ఆద‌ర‌ణ ప్ర‌త్యేకం. కుర్చీ అంచుపై కూచోబెట్టి ఉత్కంఠ‌గా చూసేంత మ్యాట‌ర్ ఉంటే ఆ త‌ర‌హా సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. ఇప్ప‌టికే ప‌లు సినిమాలు.. వెబ్ సిరీస్ లు ఈ త‌ర‌హాలో వ‌చ్చి విజ‌యం సాధించాయి. ఇప్పుడు ఆ కోవ‌లోనే కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న `పెంగ్విన్` చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగుకి రెడీ అవుతోంది. తెలుగు-త‌మిళం-మ‌ల‌యాళంలో ట్రీటివ్వ‌బోతోంది.

తాజాగా పెంగ్విన్ టీజ‌ర్ రిలీజైంది. జూన్ 11న ట్రైల‌ర్ రిలీజ్ కి ముందే టీజ‌ర్ ఉత్కంఠ‌ను పెంచుతోంది. కేవ‌లం కొన్ని సెక‌న్ల నిడివితో ఉన్న ఈ టీజ‌ర్ లో క్రైమ్ ఎలిమెంట్.. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ ఎలిమెంట్ ఆస‌క్తిని పెంచాయి. కొడుకును కోల్పోయి వేద‌న‌కు గుర‌య్యే గ‌ర్భిణిగా కీర్తి సురేష్ న‌టించింది. హాలీవుడ్ ఆస్కార్ మూవీ జోక‌ర్ త‌ర‌హా క్యారెక్ట‌రైజేష‌న్ మ‌ర్డ‌ర్ సీన్ ఉత్కంఠ‌కు గురి చేస్తోంది. టీజ‌ర్ లో చూపించినంత గ్రిప్ సిరీస్ ఆద్యంతం ప్ర‌తి ఫ్రేములోనూ చూపిస్తేనే ఈ చిత్రానికి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. ల్యాగ్ లేకుండా ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది.

నిన్న‌నే పెంగ్విన్ కొత్త పోస్టర్ రిలీజై ఆస‌క్తి పెంచింది. కీర్తి సురేష్ పెదవుల నుండి రక్తం చిమ్ముతూ ఉంటే.. ముక్కుపై తీవ్రంగా క‌త్తి గాయం.. భీకరమైన స‌న్నివేశాన్ని త‌ల‌పిస్తూ పోస్ట‌ర్ ఆస‌క్తిని పెంచింది. గత నెలలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో జ్యోతిక యొక్క పొన్మగల్ వంధల్ విడుదలైన తరువాత పెంగ్విన్ OTT ప్లాట్ ఫాంపై విడుదల చేస్తున్న రెండవ దక్షిణ భారత చ‌ల‌న చిత్రం అనే చెప్పాలి.

కీర్తి సురేష్ న‌టించిన ఈ చిత్రం జూన్ 19న‌ విడుదలవుతోంది. ఆడ‌వారిపై నేరాలపై తీసిన‌ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు మరియు కార్తీక్ సుబ్బరాజ్ కి చెందిన‌ స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ అండ్ పాషన్ స్టూడియోస్ ప్రొడక్షన్ నిర్మించింది. గర్భిణీ స్త్రీ గా కీర్తి సురేష్ పోరాటం ఆద్యంతం ఉత్కంఠ‌ను క‌లిగిస్తుంద‌ట‌.

Full View
Tags:    

Similar News