ఫోటో స్టోరి: 'శ‌్ర‌ద్ధ‌' గా బుద్ధి గా మ‌ళ్లొచ్చింది

Update: 2019-11-12 15:36 GMT
శ్ర‌ద్ధ‌గా బుద్దిగా మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది. గ‌త కొంత‌కాలంగా సైలెంటైపోయిన ఈ భామ ఈసారి ఏదో కొత్త‌గానే ట్రై చేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. టాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసి ఆరంభం అల్ట్రా మోడ్ర‌న్ స్టైల్స్ తో గ్లామ‌ర‌స్ ట్రీట్ ఇచ్చిన శ్ర‌ద్ధా దాస్ మ‌ళ్లీ మ‌ళ్లీ త‌న ల‌క్ చెక్ చేసుకునేందుకు వ‌స్తూనే  ఉంది. అయితే ఈ కిల్లింగ్ బ్యూటీ కెరీర్ ని ముందుకు న‌డిపించ‌డంలో మాత్రం ప్ర‌తిసారీ ఫెయిల‌వుతూనే ఉంది. ఈసారి ల‌క్ చిక్కుతుందా?  లేదా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్.

 `సిద్ధూ ఫ్ర‌మ్ సికాకుళం` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన శ్ర‌ద్ధాదాస్ కెరీర్ ఆరంభం మంచి అవ‌కాశాల్ని అందుకున్నా కాల‌క్ర‌మంలో అందాల ఆర‌బోత శ్రుతి మించి  ఆ త‌ర‌హా పాత్ర‌ల‌కే ప‌రిమిత‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో 18 చిత్రాల్లో న‌టించినా శ్ర‌ద్ధాదాస్‌కు మాత్రం ఆశించిన గుర్తింపు మాత్రం ద‌క్క‌లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న టాలెంట్‌ని నిరూపించుకోవాల‌ని మ‌ళ్లీ తెలుగు తెర‌పై వెళ‌గాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తూనే వుంది.

ఆ ప్ర‌య‌త్నంలో భాగంగా గుంటూర్ టాకీస్‌- డిక్టేట‌ర్‌-పీఎస్‌వీ గ‌రుడ‌వేగ- ఉద్ఘ‌ర్ష‌-హిప్పీ వంటి చిత్రాల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. కానీ ఫ‌లితం లేకుండా పోయింది. గుంటూర్ టాకీస్ లో ర‌ష్మీ డామినేట్ చేస్తే పీఎస్ వీ గ‌రుడ‌వేగ‌లో స‌న్నీలియోన్‌ డామినేట్ చేసేసింది. హిప్పీతో అయినా మ‌ళ్లీ రెచ్చిపోవాల‌ని ప్ర‌య‌త్నించినా దిగాంగ‌న సూర్య‌వంశీ ఆ ఛాన్స్ ఇవ్వ‌లేదు. పైగా ఆ సినిమా అడ్ర‌స్ లేకుండా పోవ‌డంతో శ్ర‌ద్ధాదాస్ కు మ‌రో ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో క‌న్న‌డ‌- బెంగాలీ భాష‌ల్లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటోంది. ప్ర‌స్తుతం `కోటి గొబ్బ 3` అనే చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ సాగుతోంది. ప‌నిలో ప‌నిగా మ‌రోసారి తెలుగులోనూ త‌న స‌త్తా చాటు కోవాల‌ని ఇన్ స్టాని హీటెక్కించేస్తోంది. శ్ర‌ద్ధాగా బుద్ధిగా ముద్దుగా ఫొటోల‌కు పోజిచ్చిన తీరు చూసైనా మ‌ళ్లీ శ్ర‌ద్ధాకు తెలుగులో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఛాన్సిస్తారేమో చూడాలి.
Tags:    

Similar News