బంజ‌రు భూమిని కాదు బంగారు ఇసుక‌ను!

Update: 2021-12-31 01:30 GMT
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీక‌పూర్ ఇన్ స్టా షోస్ గురించి తెలిసిందే. ఎప్ప‌టిక‌ప్పుడు బికినీలు స్విమ్ సూట్ల‌తో మంట‌లు పెట్ట‌డం త‌న‌కు ఓ హాబీ. తాజాగా ఈ బ్యూటీ మ‌రోసారి భ‌గ భ‌గ మండుతోన్న ఏడారి ఇసుక తెన్నుల మ‌ధ్య కెమెరాకి ఫోజులిచ్చింది. మ‌నీష్ మ‌ల్హోత్రా ఈ బ్యూటీ కోసం బంగారు క‌ప్తాన్ డిజైన్ చేసారు. ఈ లుక్ లో బ్రాంజ‌ర్ గోల్డెన్ ఐషాడో ట‌చ్ తో మెరిసిపోతోంది.

బంగారు సూర్య చిహ్నాన్ని పాపిడిబొట్టుగా జాన్వీ కి సెట్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. సౌదీ అరేబియా ఇసుక ఏడారిలో ఇలా కెమెరాకి ఫోజులిచ్చింది. జాన్వీ దుస్తులు ఏడారికి త‌గ్గ‌ట్టుగా ఫ్లెక్సిబుల గా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. భ‌గ‌భ‌గ‌ల‌ సూర్యుని నుండి ప్రేర‌ణ పొంది ఈ డిజైన్ లు రూపొందించార‌ట‌.

జాన్వీ ఈ ఫోటోల్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ``మీరు బంజ‌రు భూమిని ఎక్క‌డ చూస్తారు? కానీ నేను మాత్రం బంగారు ఇసుక‌ను చూస్తున్నాను`` అని పోస్ట్ చేసింది. దీనికి మ‌నీష్ మ‌ల్హోత్రా అద్భుతంగా క‌నిపిస్తోందంటూ వ్యాఖ్యానించారు. జాన్వీ స‌వ‌తి సోద‌రి అన్షులా క‌పూర్ కూడా `హా` అనే క్యాప్ష‌న్ ఇచ్చి జాన్వీని ప్ర‌శంసించింది. ఇదే నెల‌లో ఇలాంటి ఫోటో సెష‌న్లో జాన్వీ పాల్గొన‌డం రెండ‌వ‌సారి. ఈనెల ఆరంభంలో పౌడ‌ర్ పింక్ రిబ్డ్ దుస్తుల్లో ఏడారి రాళ్ల‌పై ప‌డుకుని కెమెరాకి ఫోజులిచ్చింది. నేపాల్-అమెరిక‌న్ డిజైనర్ ప్ర‌బ‌ల్ గురుంగ్ ఈ వ‌స్త్రాల్ని డిజైన్ చేసారు.

ఇక జాన్వీ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం క‌ర‌ణ్ జోహార్ బ్యాన‌ర్లో `దోస్తానా-2` లో న‌టిస్తోంది. అదే బ్యాన‌ర్ లో మ‌రో రెండు చిత్రాలు క‌మిట్ అయింది. అలాగే అమ్మ‌డు న‌టించిన `గుడ్ ల‌క్ జెర్రీ` సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది.

`మిలీ` అనే మ‌రో చిత్రంలో కూడా న‌టిస్తుంది. వ‌చ్చే ఏడాది ఆ సినిమా రిలీజ్ కానుంది. ఇక ద‌క్షిణాదిన ఎంట్రీ ఇవ్వ‌డానికి జాన్వీ ఆస‌క్తిగానే ఉంది. కానీ స‌రైన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంది. ఆ ఛాన్స్ వ‌స్తే వ‌దులుకోవ‌డానికి ఎంత మాత్రం సిద్దంగా లేదు. త‌ల్లి త‌ర‌హాలోనే అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేయాల‌ని ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంది.


Tags:    

Similar News