మోహన్ లాల్ సినిమాకు మోడీ మద్దతు?

Update: 2017-06-05 11:49 GMT
మోహన్ లాల్ కథానాయకుడిగా మహాభారత కథతో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడానికి దుబాయ్ బేస్డ్ బిజినెస్ మ్యాన్ బీఆర్ శెట్టి ముందుకొచ్చాడు. ప్రముఖ రచయిత వాసుదేవన్ రచించిన ‘రండమూళం’ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి శ్రీకుమార్ మీనన్ సన్నాహాలు చేస్తున్నాడు. ఐతే ఈ సినిమాపై ప్రకటన రావడం ఆలస్యం ఒక వివాదం చెలరేగింది. ఈ చిత్రానికి ‘మహాభారతం’ అనే పేరు పెడితే ఒప్పుకోమంటూ కేరళకు చెందిన హిందూ సంఘం ఒకటి అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘మహాభారతం’ అనే పేరుపై సర్వ హక్కులూ వ్యాసుడికే చెందుతాయని.. ఆ పేరును వాడుకోవడానికి వీల్లేదని ఆ సంఘం పేర్కొంది.

ఇలాంటి తరుణంలో ఈ మెగా ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మద్దతు పలుకుతున్నారన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. టైటిల్ విషయంలో వివాదం నడుస్తున్న సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి తమకు లేఖ వచ్చినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రాన్ని చూసేందుకు తాను ఆసక్తితో ఉన్నానని.. దేశానికి ఇలాంటి సినిమాలు గర్వకారణమని నరేంద్ర మోడీ ఆ లేఖలో పేర్కొన్నట్లు వారు చెప్పారు. ఈ సినిమా విషయమై ప్రధాని అపాయింట్మెంట్ కోరగా.. పీఎంవో వర్గాలు సానుకూలంగా స్పందించినట్లు కూడా చిత్ర బృందం వెల్లడించింది. నిజంగా ఈ చిత్రానికి మోడీ నుంచి మద్దతు లభిస్తే ఆ చిత్ర యూనిట్‌ కు అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్లో చేపడుతున్న ఈ రిస్కీ ప్రాజెక్టు విషయంలో ప్రధాని సానుకలంగా ఉంటే సినిమాను పెద్ద స్థాయికి తీసుకెళ్లేందుకు అవకాశమున్నట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News