విభిన్నమైన సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసురున్నారు మణిరత్నం. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ `పొన్నియిన్ సెల్వన్`. విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ, త్రిష, జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మద్రాస్ టాకీస్ తో కలిసి లైకా ప్రొడక్షన్స్ ఈ భారీ విజువల్ వండర్ ని నిర్మిస్తోంది.
గత కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ ని తెరపైకి తీసుకురావాలని విశ్వప్రయత్నాలు చేశారు మణిరత్నం. ఫైనల్ గా ఆయన డ్రీమ్ ని అర్థం చేసుకుని లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కర్ ముందుకు రావడంతో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చింది.
10 వ శతాబ్దం కాలం నాటి చోళ రాజుల నేపథ్యంలో ఈ సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 30న తమిళం తో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమాని భారీగా విడుదల చేయబోతున్నారు. శుక్రవారం సాయంత్రం ఈ మూవీ తెలుగు టీజర్ ని హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు.
నా అభిమాన దర్శకులలో మణిరత్నం సర్ ఒకరు. ఆయన రూపొందించిన `పొన్నియిన్ సెల్వన్ 1` టీజర్‌ని విడుదల చేయడం థ్రిల్లింగ్ గా వుంది. ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నాను` అని మహేష్ టీజర్ రిలీజ్‌చేసి ట్వీట్ చేశారు. `సముద్రంలో పడవలు..కిరీటాన్ని ఎత్తి చూపుతూ ప్రజలకు అభివాదం చేస్తున్న రాజు... చోళ రాజ సింహాసం.. అంబారీపై కత్తి దూస్తూ విక్రమ్ కోట గేట్లు బద్దులు కొట్టుకుని వస్తున్న విజువల్స్... కదనరంగానికి సిద్ధంగా వున్న కార్ది, జయం రవి... తన సైన్యంతో సిద్ధంగా వున్న శరత్ కుమార్, అదను కోసం చూస్తున్న రాజులా ప్రకాష్‌రాజ్.. విజయగర్వంతో రాజం ఉట్టిపడుతున్న క్వీన్స్ లా ఐశ్వర్యా రాయ్, త్రిష వంటి విజువల్స్ టీజర్ లో అబ్బుర పరుస్తున్నాయి.
టీజర్ ఎండింగ్ లో `ఈ కల్లు, ఈ పాట, రక్త పాతం అంతా దాన్ని మర్చిపోవడానికే, ఆమెను మర్చిపోవడానికే.. నన్ను నేను మర్చిపోవడానికే..`అంటూ విక్రమ్ పలికిన సంభాషణలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చోళ రాజ్యం నేపథ్యంలో ఈ చారిత్రక డ్రామా సాగనుంది. చోళుల కాలంలో జరిగిన అంతర్యుద్ధాల నేపథ్యంలో సాగిన కథగా ఈ పీరియాడికల్ డ్రామాని తెరకెక్కించారు. `బాహుబలి` స్ఫూర్తితో తెరపైకొచ్చిన ఈ మూవీ విజువల్స్ బాహుబలిని గుర్తు చేస్తున్నాయి.
రవివర్మన్ విజువల్స్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఏ.ఆర్ . రెహమాన్ సంగీతం, లైకా ప్రొడక్షన్స్ అన్ కాంప్రమైజ్డ్ మేకింగ్, మణిరత్నం టేకింగ్ వెరసి `పొన్నియిన్ సెల్వన్ ` విజువల్ వండర్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 30న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలని ప్రారంభించింది.
టీజర్ లోని ప్రతీ ఫ్రేమ్ లోనూ విజువల్ గ్రాండియర్ కనిపిస్తోంది. బారీ స్థాయిలో ఈ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. తెలుగు టీజర్ ని మహేష్ బాబు విడుదల చేయగా, హిందీలో అమితాబ్ బచ్చన్, మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో సూర్య, కన్నడంతో రక్షిత్ శెట్టి విడుదల చేశారు.
Full View