వైఎస్ ప‌రువు తీస్తావా?..పూనమ్ ట్వీట్ వైర‌ల్!

Update: 2018-10-06 11:27 GMT
కొంత‌కాలం క్రితం ప‌వ‌న్ ఫ్యాన్స్-క‌త్తి మ‌హేష్ వివాదం నేప‌థ్యంలో త‌న వ‌రుస ట్వీట్ల‌తో పూనమ్ కౌర్ వార్తల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత టాలీవుడ్ లోని ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడిపై ప‌రోక్షంగా పూన‌మ్ గుప్పించిన విమ‌ర్శ‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. కొద్ది రోజులుగా ట్విట్ట‌ర్ లో పెద్ద‌గా యాక్టివ్ గా లేని పూన‌మ్...తాజాగా మ‌రో ట్వీట్ తో తెర‌పైకి వచ్చింది. ఏపీ - తెలంగాణల‌లో ప్ర‌స్తుత‌ రాజ‌కీయాల‌పై పూన‌మ్ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ కు స్పందించిన ఓ నెటిజ‌న్....పూన‌మ్ పై కామెంట్స్ చేశాడు. దీంతో, అత‌డికి పూన‌మ్ ఘాటుగా రిటార్ట్ ఇచ్చింది. దివంగ‌త నేత‌ వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి వంటి పెద్ద మ‌నిషి ప‌రువు తీయ‌కంటూ అత‌డికి క్లాస్ పీకింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఆ ట్వీట్స్ వైర‌ల్ అయ్యాయి.
 
ప్ర‌స్తుతం ఏపీ - తెలంగాణ‌లో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో పూన‌మ్ ఓ ట్వీట్ చేసింది. ఆంధ్రా.. తెలంగాణ అంటూ మనలో మ‌న‌మే కొట్టుకుని వేరేవారికి ల‌బ్ధి చేకూరుస్తున్నామ‌ని పూన‌మ్ ట్వీట్ చేసింది. పిల్లి-పిల్లి తగువును కోతి తీర్చిన కథ గుర్తుకు వస్తోందంటూ ఓ కార్టూన్ ఫొటోను పెట్టింది. పూన‌మ్ ట్వీట్ కు ఆనంద్ రెడ్డి కోలా అనే నెటిజన్ వెట‌కారంగా స్పందించాడు. ``ఓటుకు నోటు వల్ల లాభం ఎవరికి?...పూర్తి రాజ‌కీయ అప‌రిప‌క్వ‌త‌తో చేసిన‌ రాజకీయ ట్వీట్ ఇది. మీరు ఏం మాట్లాడినా మీవల్ల టీడీపీకి ఒక్క ఓటు కూడా రాదు`` అని ట్వీట్ చేశాడు. ఆ నెటిజ‌న్ దివంగతనేత‌ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడు. ఈ క్ర‌మంలో ఆనంద్ కు పూన‌మ్ క్లాస్ పీకింది. ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్న ఆ పెద్దమనిషి విలువ తీయవ‌ద్ద‌ని - సోషల్ మీడియాలో ఈ త‌ర‌హా భాష వాడ‌డం గొప్ప కాద‌ని రిటార్ట్ ఇచ్చింది. అత‌డి వ్యాఖ్యలు రోత పుట్టిస్తున్నాయ్ అని ఘాటుగా రిటార్ట్ ఇచ్చింది.

Tags:    

Similar News