ఏ సినిమాని అయినా జనాలు రివ్యూలు చదివి చూస్తారని అనుకోవడం పెద్ద భ్రమ అనే సంగతి ఇప్పటికే తెలిసిపోయింది. మంచి సినిమాకి రివ్యూలు హెల్ప్ అవుతాయేమో తప్ప.. బాగోని సినిమాలను ఎంతగా ఊదరగొట్టినా జనాలు థియేటర్లకు రావడం చాలా కష్టం. డైలాగ్స్ రాయడంలో మాస్టర్ అనిపించుకునే పూరీ జగన్నాధ్ ఈ పాయింట్ మిస్ అయాడేమో అనిపిస్తోంది.
తాజాగా పూరీ తీసిన రోగ్ మూవీ డిజాస్టర్ రూట్ లో ఉన్న సంగతి జనాలకు తెలిసిందే. ముందు నుంచి ఇంట్రెస్ట్ కలిగించని ఈ సినిమా.. రిలీజ్ తర్వాత మరీ ఘోరమైన టాక్ తెచ్చుకుంది. అయితే.. తాజాగా తమ సినిమా సూపర్ హిట్ అంటూ పూరీ ఓ పోస్టర్ వేశాడు. ఫ్లాప్ సినిమాకి అయినా ఇలాంటి పోస్టర్స్ పడ్డం మామూలే అనుకుందామంటే.. ఆ పక్కన రోగ్ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు ఇచ్చిన వెబ్ సైట్స్.. అవి ఇచ్చిన రేటింగ్స్ ను కూడా వేయడం విశేషం. వందలు.. వేలకొద్దీ సైట్స్ ఉండగా పదో పదిహేను సైట్స్ పాజిటివ్ రాయడం.. రాయించుకోవడం కామన్. అలాగని ఇప్పుడు రోగ్ ను సూపర్ హిట్ అని ఒప్పించేందుకు ప్రయత్నించడం దారుణం.
ఇలా పాజిటివ్ రివ్యూలు రాసిన సైట్లను ఏరడంలో పూరీ టీం బాగానే కష్టపడింది. ఓ సైట్ పేరును రెండు సార్లు రాశారనే గ్రహింపు కూడా లేకుండా పోస్టర్ వేశారంటే.. ఇలా ఏరడంలో ఎంత ఎలర్ట్ గా ఉన్నారో అర్ధమవుతుంది. అయినా.. రివ్యూలు.. వాటిలో ఇచ్చే పాయింట్స్ కే జనాలు థియేటర్లకు వస్తారంటే.. ఈ మధ్యకాలంలో ఘాజీ.. నగరం వంటి సినిమాలకు 4 స్టార్లు కూడా ఇచ్చారు.. కాని కలక్షన్ల విషయంలో జనాలు తొక్కేశారు. తెలుసుకోండి గురూ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/