యంగ్ హీరో నాగశౌర్యకు సాలీడ్ హిట్ పడి చాలా రోజులవుతోంది. ఒక విధంగా చెప్పాలంటే 'ఛలో' తరువాత శౌర్యకు ఆ రేంజ్ హిట్టు దక్కడం లేదు. దాదాపు నాలుగేళ్లుగా సక్సెస్ కోసం ఈ యంగ్ హీరో విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. సొంత నిర్మాణ సంస్థలో 'ఛలో'తో ఫామ్ లోకి వచ్చిన నాగశౌర్య మళ్లీ తన బ్యానర్ లోనే మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో వున్నాడు. నాగశౌర్య నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీ 'కృష్ణ వ్రింద విహారి'.
గోవాలోని డామన్ లో పుట్టి న్యూజిలాండ్ లో పాప్ సింగర్ గా పాపులర్ అయిన షెర్లీ సేటియా ఈ మూవీ ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. హిందీలో మస్కా, 'నికమ్మా' వంటి సినిమాలతో ఆకట్టుకున్న షెర్లీ సేటియాకిది తెలుగులో తొలి మూవీ. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై హీరో నాగశౌర్య మదర్ ఉషా ముల్పూరి ఈ మూవీని నిర్మించారు. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 23న భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది.
అగ్రహారానికి చెందిన ఓ బ్రాహ్మాణ యువకుడు సిటీలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంటాడు. అక్కడ పరిచయమైన వ్రిందని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత వీరిద్దరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? .. ఈ క్రమంలో వీరు ఎదుర్కోన్న సంఘటనలేంటీ? అన్నదే ఈ చిత్ర కథ. ఆద్యంతం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా సాగే ఈ మూవీని కామెడీ టచ్ తో ఆకట్టుకునే విధంగా దర్శకుడు అనీష్ ఆర్. కృష్ణ రూపొందించాడు. ఈ సినిమా హిట్ కావడం హీరో నాగశౌర్యకు చాలా ఇంపార్టెంట్.
కథ, కథనాలపై వున్న నమ్మకంతో ఈ మూవీని స్వయంగా సొంత బ్యానర్ లోనే నిర్మించడం గమనార్హం. ఇటీవలే నాగశౌర్య మూవీ ప్రమోషన్స్ కోసం ఏపీలో చేసిన పాదయాత్ర సినిమాకు మరింత హైప్ ని తీసుకొచ్చింది. తాజాగా బుక్ మై షోలో ఈ మూవీకి పాజిటివ్ వైబ్ మొదలైంది. బుక్ మై షోలో 100కె లైక్స్ రావడం విశేషం. ఫస్ట్ డే ఫస్ట్ డే పాజిటీవ్ టాక్ తో మొదలై హిట్ టాక్ వినిపిస్తే చాలు సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
హీరో నాగశౌర్య కూడా ఇదే నమ్మకంతో వున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇదే విషయాన్ని నాగశౌర్య స్పష్టం చేయడం విశేషం. 'ఈ సినిమా కోసం నిర్మాతలుగా మా అమ్మా నాన్న చాలా కష్టపడ్డారు. కథపైనా, సినిమాపైనా నాకున్న నమ్మకంతోనే ధైర్యంగా నలుగురిలోకి వెళ్లి నిలబడ్డాను.
సినిమా చాలా బాగా వచ్చిందని నేను నమ్ముతున్నానే. నన్ను నమ్మి రండి. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని పోగొట్టుకోను' అని హీరో నాగశౌర్య నమ్మకంగా చెబుతున్న తీరు సినిమాపై తను ఎంత నమ్మకంగా వున్నాడో స్పష్టమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.