టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మొదటిసారి చారిత్రాత్మక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'హరిహర వీరమల్లు' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ పీరియడిక్ డ్రామాకు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పీరియడిక్ డ్రామా అనగానే అభిమానులు మొదట్లో కంగారు పడ్డారు. ఆయన బాడీ లాంగ్వేజ్ ఇప్పటివరకు అలాంటి పాత్రలలో చూడలేదు. మాస్ క్లాస్ అంటే ఓకే కానీ హిస్టోరికల్ హీరో క్యారెక్టర్ అంటే సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ఎప్పుడైతే చిత్రబృందం 'హరిహర వీరమల్లు' అనే టైటిల్ తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేసిందో అప్పుడే ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇంతవరకు ఊహించని షాట్ లో పవన్ కళ్యాణ్ కనిపించేసరికి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అప్పటినుండి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమా వకీల్ సాబ్ రిలీజ్ సమయంలోనే షూటింగ్ బ్రేక్ చెప్పినట్లు తెలుస్తుంది. ఎందుకంటే వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ తర్వాత పవన్ అసలు బయటికి రాలేదు. ఐదు రోజుల నుండి ఆయన ఐసొలేషన్ లోనే ఉన్నాడు. అయితే షూటింగ్ ఆపిన విషయం బయటకి చెప్పలేదు కానీ పవన్ కరోనా బారిన పడ్డారనేది మాత్రం జనాలకు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. హరిహర వీరమల్లు షూటింగ్ పవన్ పూర్తి ఆరోగ్యంగా బయటికి వచ్చాకే జరగనుంది. ఓవైపు వీరమల్లు సినిమాతో పాటు మరోవైపు అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ షూటింగ్ కూడా నిలిచిపోయింది. అయితే వీరమల్లు సినిమా వచ్చే సంక్రాంతికి రాబోతుండగా.. అయ్యప్పనుమ్ రీమేక్ మాత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కాబోతుంది. ఈ రీమేక్ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. చూడాలి మరి పవన్ ఎప్పుడు బయటికి వస్తారో!