ఏపీ టికెట్ల రేట్ల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరంజీవి సారధ్యంలో టాలీవుడ్ బృందం సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవడంతో ఆయన నుండి సానుకూల స్పందన వచ్చిందని అతి త్వరలోనే జీవో వస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో మీటింగ్ కు హాజరు అయిన ప్రభాస్ మరియు మహేష్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిరంజీవి స్వయంగా సీఎం జగన్ తో మీటింగ్ కు ఇండస్ట్రీ పెద్ద హీరోలు అయిన కొందరిని ఆహ్వానించాడని.. అందరం వెళ్లి సీఎం జగన్ తో మాట్లాడాలంటూ చిరంజీవి కోరగా ప్రభాస్ మరియు మహేష్ బాబు అందుకు అంగీకరించి రాబోతున్నారు అంటూ వార్తలు వచ్చిన సమయంలో చాలా మంది నమ్మలేదు.
ప్రభాస్.. మహేష్ బాబు.. ఎన్టీఆర్ లు సీఎం జగన్ తో మీటింగ్ కు హాజరు అవ్వడం ఏంటీ విడ్డూరం కాకుంటే.. వాళ్లకు ఏం అవసరం.. నిర్మాతలు బయ్యర్లు ఆ వ్యవహారాన్ని చూసుకుంటారు. ఇండస్ట్రీ పెద్ద గా చిరంజీవి వెళ్లి జగన్ తో మాట్లాడుతారు కాని స్టార్ హీరోలు ఎందుకు వెళ్తారు అనుకున్న వారు నోరు వెళ్లబెట్టేలా నిన్న ప్రత్యేక విమానంలో మహేష్ బాబు.. ప్రభాస్.. చిరంజీవి ఇంకా పలువురు వెళ్లారు.
మెగాస్టార్.. సూపర్ స్టార్.. రెబల్ స్టార్ ఈ ముగ్గురిని ఈ మద్య కాలంలోనే కాదు ఏ కాలంలో కూడా కలిపి చూడలేదు. ఒక అరుదైన అద్బుతమైన కలయిక ఇది. కారణం ఏదైనా ఈ ముగ్గురు కలవడం అనేది టాలీవుడ్ ప్రేక్షకులకు కన్నుల పండుగ అనడంలో సందేహం లేదు. ఈమద్య కాలంలో చిరంజీవి పలు వేదికల మీద.. పలు సందర్బాల్లో కనిపిస్తున్నారు. కాని మహేష్ బాబు మరియు ప్రభాస్ లు చాలా అరుదుగా మీడియాలో కనిపిస్తూ ఉంటారు.
అది కాకుండా వారిద్దరు కలిసి ఏదో ఒక సినిమా వేడుక కోసం దాదాపుగా దశాబ్దంనర క్రితం కలిశారు. మళ్లీ వారిద్దరిని ఒక ఫ్రేమ్ లో ఇలా చూడటం అభిమానులకు కన్నుల పండుగగా ఉండి ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో అభిమానులు మాత్రమే కాకుండా సాదారణ ప్రేక్షకులు కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అనడంలో సందేహం లేదు. కొన్ని లక్షల మంది తెలుగు సినీ అభిమానులు ప్రభాస్ మరియు మహేష్ బాబులు కలిసి ఉన్న ఫొటోలను నిన్న ఒక్క రోజే సోషల్ మీడియాలో షేర్ చేశారు అంటే సెలబ్రేషన్ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
వీరిద్దరి కలయిక చాలా అరుదు కనుక ఇది ఎప్పటికి గుర్తుండి పోయే సంఘటన అవుతుందని అంటున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన సమయంలో ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్బంగా కూడా ప్రభాస్ మరియు మహేష్ బాబులు పక్క పక్కనే ఉండటం.. ఒకరిని ఒకరు పట్టుకుని చాలా కలివిడిగా మాట్లాడుకోవడం.. నవ్వుకోవడం కనిపించింది. అమరావతిలో సీఎం జగన్ తో భేటీ ఏమో కాని ఒక అద్బుతమైన విజువల్ వండర్ మాత్రం క్రియేట్ అయ్యింది అనడంలో సందేహం లేదు.
ఈ విజువల్ లో ఎన్టీఆర్ కూడా ఉండి ఉంటే మరింతగా అద్బుతం పండేది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ కోసం కాకున్నా అభిమానుల కోసం అయినా ఎన్టీఆర్ సీఎం జగన్ తో మీటింగ్ కు వెళ్లి ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.