అందరిదీ ఒక దారి అయితే... తనది మాత్రం మరోదారి అన్నట్టుంది రెబల్ స్టార్ ప్రభాస్ వాలకం. బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఏడాదికో సినిమా చేస్తుంటే... ప్రభాస్ మాత్రం ఒక్కో సినిమా పూర్తి చేయడానికి ఏళ్లకు ఏళ్లు తీసుకుంటున్నాడు. మొన్న రాజమౌళి... ఇప్పుడు సుజిత్ దర్శకులు మారినా సినిమా తీసే సమయం మాత్రం మారట్లేదు.
‘మిర్చి’ సినిమా తర్వాత సంచలన దర్శకుడు రాజమౌళితో ‘బాహుబలి’ సినిమాకి కమిట్ అయ్యాడు ప్రభాస్. 2013లో షూటింగ్ మొదలెడితే మొదటి భాగం రావడానికి రెండేళ్లు పట్టింది. ‘కంక్లూజన్’ రావడానికి ఇంకో రెండేళ్లు పట్టింది. ఒక కమర్షియల్ హీరో ఒకే ప్రాజెక్టు మీద ఇన్నేళ్లు పనిచేయడం అంటే రిస్కే అనుకోవాలి. కానీ బాహుబలి సినిమా బంపర్ హిట్టయ్యి... ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి అభిమానులని తెచ్చిపెట్టింది. దాంతో మనోడు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని సంతోషించారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇకనైనా ఏడాదికో సినిమా చేస్తాడని భావించారు. అయితే ప్రభాస్ తీరు మాత్రం వేరేలా ఉంది. కుర్ర దర్శకుడు సుజిత్ తో ‘సాహో’ సినిమా కమిట్ అయ్యాడు.
కొత్త దర్శకుడే కదా... త్వరగా ముగించేస్తాడులే అనుకుంటే... ఇప్పుడు అప్పుడు అంటూ షూటింగ్ మొదలెట్టడానికే కొన్నినెలలు తీసుకున్నాడు సుజిత్. ప్రభాస్ క్రేజ్ పెరిగిపోవడంతో అందుకు అనుగుణంగా స్క్రిప్టులో మార్పులు కూడా చేశాడంట. దీంతో ఖర్చు కూడా తడిసి మోపెడవుతోంది. దుబాయ్ లో షూటింగ్ కి పర్మిషన్ రాకపోవడంతో ఇంకా ఆలస్యం జరుగుతోంది. అనుకున్న సమయానికి వచ్చినా 2019 సంక్రాంతి దాకా ఆగాల్సిందే. అంటే డార్లింగ్ సినిమా చూడాలంటే మళ్లీ రెండేళ్ల వెయిటింగ్ తప్పదు. దీంతో ఓ రకమైన ప్రస్టేషన్ కి గురవుతున్నారు ఆయన అభిమానులు. ప్రభాస్ సినిమాల్లోకి వచ్చి 16 ఏళ్లు అవుతోంది. ఇప్పటికి ఆయన చేసిన సినిమాల సంఖ్య 18 దే. ఇంత లేటుగా సినిమాలు చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఒక్కడే! ఇలాగైతే ఎలా సామీ!