డార్లింగ్ లెక్కలో సాహో స్మాషింగ్ హిట్
డార్లింగ్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'సాహో' ఆగష్టు 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి అటు విమర్శకుల నుండి.. రివ్యూయర్ల నుండి నెగెటివ్ రెస్పాన్స్ దక్కింది. సోషల్ మీడియాలో కూడా నెటిజన్ల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది. అయితే ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ మాత్రం భారీగానే ఉన్నాయి. సినిమా బ్రేకీవెన్ మార్క్ చేరేందుకు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి కానీ 'సాహో'టీమ్ మాత్రం భారీ కలెక్షన్ల పోస్టర్లతో సినిమా హిట్ అనే అభిప్రాయం కలిగించేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ సినిమా రిలీజ్ కు ముందు భారీగా ప్రమోషన్స్ చేపట్టిన ప్రభాస్ సినిమా విడుదల తర్వాత లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తున్నాడు. రిలీజ్ తర్వాత మీడియాను కలవలేదు. అయితే తాజాగా ప్రభాస్ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక పోస్టర్ ను షేర్ చేసి "నా ప్రియమైన అభిమానులకు ప్రేక్షకులకు.. సాహో పట్ల మీరు చూపించిన అవధులు లేని ప్రేమకు నా కృతజ్ఞతలు. ఈ సినిమా ఇలా ఉండడానికి కారణం కేవలం మీనుంచి వచ్చిన అద్భుతమైన స్పందన.. అభినందనలు. మీ అందరికీ నా లవ్" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
ఈ పోస్టర్ లో "ఎ స్మాషింగ్ హిట్ రూ. 350Cr + గ్రాస్ వరల్డ్ వైడ్"అంటూ వెల్లడించారు. నిజానికి ఈ సినిమా హిందీ వెర్షన్ సక్సెస్ దిశగా పయనిస్తోందని అని.. హిందీ వెర్షన్ తప్ప మిగతా అన్నీ వెర్షన్స్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ కు దరిదాపుల్లో లేవని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయితే ఓవరాల్ కలెక్షన్ ఫిగర్ మాత్రం భారీగా ఉంది. మరి ప్రభాస్ 'స్మాషింగ్ హిట్' పోస్టర్ ను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేశాడంటే.. హిట్ అని అధికారికంగా ధృవీకరించినట్టు అనుకోవాలేమో..!