తమిళ స్టార్ హీరో సూర్య మరియు యాక్షన్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు తమిళ్ లో ఒక సినిమాను నిర్మించబోతున్నట్లుగా ఇటీవలే వార్తలు వచ్చాయి. కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాకు మరో నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లుగా తెలుస్తోంది. సూర్య 42వ సినిమా గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు లాంచనంగా జరిగాయి.
సూర్య మరియు శివల కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించబోతున్నారు. తాజాగా జరిగిన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంకు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కూడా పాల్గొన్నాడు. ఈ సినిమా తో యూవీ క్రియేషన్స్ వారు తమిళ్ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో కచ్చితంగా మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.
ప్రభాస్ కి హోం బ్యానర్ గా పేరు పడిపోయిన యూవీ క్రియేషన్స్ ఈ సినిమా తో తమిళనాట గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళ నాట విపరీతమైన ఈ క్రేజీ కాంబో మూవీ షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. రెగ్యులర్ షూటింగ్ ను కూడా వెంటనే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
ఈ మధ్య కాలంలో పలువురు తెలుగు సినిమా నిర్మాతలు ఇతర భాషల్లో సినిమాలను నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దిల్ రాజు ఇప్పటికే విజయ్ తో ఒక సినిమాను మరియు శంకర్ తో మరో సినిమా ను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు యూవీ క్రియేషన్స్ వారు కూడా తమిళ్ సినీ ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ మన యొక్క సందడి మరియు సత్తా పెరిగినట్లు అవుతుందని టాలీవుడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.