బలమైన సినిమా నేపథ్యం నుంచి ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చాడు. తన పెదనాన్న మాదిరిగానే ఆయనది భారీ పర్సనాలిటీ .. బేస్ వాయిస్. మాస్ ఆడియన్స్ కోరుకునే కరకుదనం ఆ వాయిస్ లో పలుకుతుంది. ఎంతమంది రౌడీలు ఎదురొచ్చినా ఆ వాయిస్ శాసిస్తుంది.
తమ హీరోని విలన్ గ్యాంగ్ చుట్టుముట్టినప్పుడు ఏమైపోతాడోననే భయం అభిమానుల్లో ఉండదు. అందుకు కారణం తమ హీరోపై ఉన్న నమ్మకం. అలాంటి నమ్మకాన్ని ఆడియన్స్ లో కలిగించిన ప్రభాస్ .. రెబల్ స్టార్ బిరుదును కూడా పెదనాన్న అభిమానుల నుంచి అందుకున్నాడు.
ప్రభాస్ ఎప్పుడూ కూడా సాధ్యమైనంత త్వరగా చకచకా సినిమాలు చేసేయాలనే ఆరాటాన్ని చూపించలేదు. ఒక సినిమా తరువాత ఒకటిగా చేస్తూ వెళుతున్నాడు. ఆయన మంచి భోజనప్రియుడు .. తనతో పాటు సెట్లో ఉన్న మిగతావారికి కూడా ఇంటి నుంచి భోజనాలు తెప్పిస్తారనే పేరు ఉంది.
అందరికీ తానే స్వయంగా వడ్డించి ఆనందిస్తూ ఉంటాడని చెబుతుంటారు. ఇక ఏ మాత్రం గ్యాప్ దొరికినా స్నేహితులను ఇంటికి పిలిపించుకుని వాళ్లతో వాలీబాల్ ఆడతాడనీ, సరదాగా కబుర్లు చెబుతూ గడిపేస్తూ ఉంటాడని అంటారు.
ఇక ఎప్పుడైతే ఆయన పాన్ ఇండియా సినిమాలను ఒప్పుకోవడం మొదలైందో .. అప్పటి నుంచి మరీ బిజీ అయ్యాడు. ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఆయన విదేశాలకు వెళుతుంటాడు. దాంతో ఆయన విదేశాలకు వెళ్లి ఏం చేస్తారనే ఆసక్తి అభిమానుల్లో తలెత్తుతూ ఉంటుంది.
తాజా ఇంటర్వ్యూలో అదే ప్రశ్న ప్రభాస్ కి ఎదురైంది. అందుకు ప్రభాస్ స్పందిస్తూ .. "పని ఒత్తిడి నుంచి బయటపడటానికే నేను విదేశాలకు వెళుతుంటాను. ట్రావెలింగ్ లో నేను ఎంతో ఎంజాయ్ చేస్తాను. నా స్నేహితులను కూడా వెంట తీసుకుని వెళతాను.
అక్కడ అందరం కలిసి సరదాగా కాలం గడుపుతాం. అక్కడ స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతాము. సూపర్ మార్కెట్ కి వెళ్లి మాకు కావాల్సినవి తెచ్చుకుంటాము. ఫ్లాట్ ఫామ్ మీద కూర్చుని గంటలకొద్దీ సోది పెట్టుకుంటాము.
నాకు నచ్చినట్టుగా ఉండటం కోసమే .. నాదైన ప్రపంచంలో సరదాగా ఉండటం కోసమే విదేశాలకు వెళుతుంటాను. అది కూడా 'బాహుబలి' విడుదల కాని ప్రాంతాలను ఎంచుకుని మరీ వెళుతుంటాను .. నన్ను ఎవరూ గుర్తుపట్టారని. కానీ ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా గుర్తుపట్టేస్తున్నారు .. అక్కడే వస్తోంది చిక్కంతా" అంటూ నవ్వేశాడు.