ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్టార్లలో పాన్ ఇండియా ఫీవర్ రాజుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ - యష్- చరణ్- తారక్ లాంటి సౌత్ స్టార్లు పాన్ ఇండియా స్టార్ డమ్ ని అందుకోవడంతో ఇది ఇతర భాషల స్టార్లను ఇన్ స్పయిర్ చేస్తోంది. దీనికి బాలీవుడ్ స్టార్లు అతీతులు కాదని తాజా సన్నివేశం చెబుతోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్లు దక్షిణాది ట్యాలెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. మన స్టార్లతో కలిసి భారీ మల్టీస్టారర్లలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు. సౌత్ లో ప్రతిభావంతులైన దర్శకులతో కలిసి పని చేసేందుకు హిందీ అగ్ర హీరోలు భేషజానికి పోవడం లేదు.
ఇక బాలీవుడ్ స్టార్లలో రణబీర్ కపూర్ ఇతర స్టార్లకు భిన్నంగా ఆలోచిస్తున్నాడు. ముఖ్యంగా సౌత్ స్టార్లను ఇక్కడి ట్యాలెంట్ ను అతడు చిన్నచూపు చూసేందుకు ఆసక్తిగా లేడు. పైగా మన స్టార్లను మన దర్శకులను కీర్తిస్తున్నాడు.
ఇటీవల తెలుగు మీడియాతో తన తాజా ఇంటరాక్షన్ లో ప్రభాస్ పై తన ఇష్టాన్ని వ్యక్తం చేశాడు. మీకు ఇష్టమైన పాన్ ఇండియా స్టార్ ఎవరు? అని అడిగినప్పుడు రణబీర్ ఏమాత్రం ఆలోచించకుండా ప్రభాస్ పేరు చెప్పాడు. ''ప్రభాస్ నాకు ఇష్టమైన పాన్ ఇండియా స్టార్. నటన - వ్యక్తిత్వం విషయానికి వస్తే అతను కచ్ఛితంగా తెలివైనవాడు. అతడిని పెద్ద స్క్రీన్ పై చూడటం నాకు చాలా ఇష్టం'' అని రణబీర్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
రణబీర్ ఆలోచనలు ఇటీవల పూర్తిగా మారాయి. అతడు ప్రస్తుతం సౌత్ మార్కెట్ పై కన్నేశాడు. హిందీ మార్కెట్ తో పాటు తెలుగు-తమిళం-మలయాళం-కన్నడలోకి దూసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు.
దానికి తగ్గట్టే ఇటీవలి కాలంలో సౌత్ లో ప్రమోషన్స్ కోసం తాపత్రాయ పడుతున్నాడు. అలాగే సౌత్ ట్యాలెంట్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'యానిమల్' అనే భారీ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని హిందీతో పాటు సౌత్ భాషల్లోనూ విడుదల చేయాలన్నది అతడి ప్లాన్.
దీంతో పాటు ఈనెలలో విడుదల కానున్న 'శంషేరా'.. ఆగస్టులో విడుదల కానున్న 'బ్రహ్మాస్త్ర' చిత్రాలను తెలుగులో భారీగా రిలీజ్ చేసేందుకు చురుగ్గా ప్రమోట్ చేస్తున్నాడు. భారీ పాన్ ఇండియా హిట్లతో స్టార్ డమ్ ని విస్తరించే ప్రణాళికలో రణబీర్ తలమునకలుగా ఉన్నాడు. ఇటీవలి కాలంలో సౌత్ స్టార్లతో సౌత్ డైరెక్టర్లతో అతడు చాలా సన్నిహితంగా మెలుగుతున్నాడు. రొటీన్ కి బిన్నంగా ఆలోచిస్తూ ఈగోలకు తావు లేకుండా వ్యవహరిస్తున్న ఏకైక హిందీ స్టార్ గా అతడిని సౌత్ ఇప్పుడు గుర్తిస్తోంది.