ప్రభాస్ నిర్ణయం సరైందేనా ?

Update: 2020-02-27 03:30 GMT
'బాహుబలి'ఫ్రాంచైజీ తర్వాత కథానాయకుడిగా ఎవరూ అందుకోలేని ఓ గొప్ప స్థానాన్ని సొంతం చేసుకున్నాడు ప్రభాస్. ఆ తర్వాత యంగ్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చి 'సాహో' చేసాడు. అప్పట్లో ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ తప్పు పట్టారు. కానీ ఎవరి మాట పట్టించుకోకుండా సుజీత్ కే ఓటేసి ఇచ్చిన మాట మీద నిలబడి సినిమా చేసాడు ప్రభాస్. కట్ చేస్తే సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. నార్త్ లో బాగానే కలెక్ట్ చేసినా అది కూడా ప్రభాస్ వల్లే అని తెలిసిందే.

ఇప్పుడు రాదా కృష్ణ తో సినిమా చేస్తున్న ప్రభాస్ మరోసారి ఎవరూ ఊహించని ఓ నిర్ణయం తీసుకున్నాడు. అవును మహానటి డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు రెబల్ స్టార్. ఈ కాంబోలో సినిమా అనౌన్స్ అవ్వగానే ప్రభాస్ ది సరైన నిర్ణయమేనా ? అనే చర్చ మొదలైంది. దీనికి రీజన్ దర్శకుడు నాగ్ అశ్విన్.  మహానటి లాంటి క్లాసిక్ అందించిన ఈ డైరెక్టర్ ప్రభాస్ తో ఎలాంటి సినిమా తీస్తాడు ? అసలు ఫ్యాన్స్ ని మెప్పించే సత్తా ఈ దర్శకుడికి ఉందా అనేది చర్చనీయాంశం అవుతుంది.

అయితే నాగ్ అశ్విన్ ని మరీ అంత తక్కువ అంచనా వేయలేము. మహానటి కి అతను దర్శకుడు కాకపోతే సినిమా ఆ రేంజ్ లో అదే అందరి ప్రశంసలు అందుకునేదే కాదు. ఇందులో సందేహమే లేదు. సో ఆ లెక్కన చూస్తే ప్రభాస్ సినిమాకి కూడా అదే రేంజ్ లో స్క్రీన్ ప్లే -సన్నివేశాలతో మేజిక్ చేసే అవకాశం ఉంది. ఇక ప్రభాస్ కూడా కథ విన్నాకే ఈ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. సో స్క్రిప్ట్ కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది కాబోలు. మరి వీరిద్దరి కాంబినేషన్ ఏ రేంజ్ హిట్ సాదిస్తుందో తెలియాలంటే ఇంకా కొన్ని నెలలు ఆగాల్సిందే. అప్పటి వరకూ ఈ సినిమా పై వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉంటాయి.
Tags:    

Similar News