వైకుంఠపురంలో ప్రభాస్‌ కు క్లారిటీ వచ్చిందా?

Update: 2020-01-13 08:56 GMT
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం 'జాన్‌' చిత్రాన్ని రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్‌ క్రేజ్‌ ఏ స్థాయిలో పెరిగిందో సాహో చిత్రం చెప్పకనే చెప్పింది. సాహో ఒక యావరేజ్‌ మూవీగా టాక్‌ తెచ్చుకున్నా కూడా ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అందుకే ప్రభాస్‌ తన ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఆచితూచి వ్యవహరిస్తూ అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటిస్తున్నాడు.

జాన్‌ చిత్రాన్ని భారీ అంచనాల నడుమ చేస్తున్న ప్రభాస్‌ ఆ తర్వాత ఒక భారీ బాలీవుడ్‌ సినిమాను చేస్తాడంటూ ఆమద్య వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్‌ మూవీపై ప్రభాస్‌ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. తెలుగులోనే తెలుగు దర్శకుడితోనే సినిమా చేసే ఉద్దేశ్యంలో ప్రభాస్‌ ఉన్నాడట. నిన్న మొన్నటి వరకు ఆయన త్రివిక్రమ్‌ తో సినిమా చేస్తాడంటూ ప్రచారం జరిగింది. త్రివిక్రమ్‌ తో ప్రభాస్‌ మూవీకి ఒక నిర్మాత చాలా ప్రయత్నిస్తున్నాడట. కాని ఇన్ని రోజులు ప్రభాస్‌ ఆలోచించాడట.

అల వైకుంఠపురంలో సినిమా విడుదలై హిట్‌ టాక్‌ దక్కించుకున్న నేపథ్యంలో ప్రభాస్‌ ఇక ఆలోచన లేకుండా త్రివిక్రమ్‌ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేయ వచ్చు అంటున్నారు. ప్రభాస్‌ జాన్‌ చిత్రం సమ్మర్‌ లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ లోపు త్రివిక్రమ్‌ మూవీ స్క్రిప్ట్‌ సిద్దం చేస్తాడంటూ అప్పుడే ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు. కాని ఇప్పటి వరకు త్రివిక్రమ్‌.. ప్రభాస్‌ ల కాంబో మూవీ గురించి ఎలాంటి చిన్న ప్రకటన కూడా అధికారికంగా రాలేదు. కనుక అసలు ఈ సినిమా ఉంటుందో లేదో తెలియదు. ఒక వేళ వీరిద్దరి కాంబో మూవీ వస్తే మాత్రం సెన్షేషన్‌ క్రియేట్‌ చేయడం ఖాయం అంటున్నారు.
Tags:    

Similar News