డార్లింగ్ జాన్ కూడా 150 పైనే?

Update: 2019-09-09 05:44 GMT
సాహోతో సరికొత్త చరిత్ర సృష్టిస్తాడనుకున్న ప్రభాస్ ఊహించని రీతిలో పెద్ద దెబ్బే వేశాడు. మొదటి నాలుగు రోజులు సెలవుల వల్ల 300 కోట్లు గ్రాస్ వచ్చింది కానీ అంతే మొత్తంలో షేర్ వస్తే కానీ సాహో బ్లాక్ బస్టర్ అని చెప్పలేని పరిస్థితి. ఇంత నెగటివ్ టాక్ లో అది అసాధ్యం కాబట్టి అభిమానులు కూడా సైలెంట్ అయిపోయారు. ఈ శుక్రవారమే చాలా చోట్ల అదనపు స్క్రీన్లన్నీ నాని సినిమాకు దారివ్వబోతున్నాయి. సరే డిజాస్టర్లు ఏ హీరోకైనా కామనే కాబట్టి దాన్ని మర్చిపోయి కొత్త సినిమా పనిలో పడిపోవాల్సిందే.

డార్లింగ్ ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. సాహో నిర్మాతలే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గారితో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ కొత్త షెడ్యూల్ ఈ నెలాఖరున నుంచి తిరిగి ప్రారంభించబోతున్నట్టు సమాచారం. దీనికి జాన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ దీన్ని జాన్ అనే పేరుతోనే ప్రస్తావించాడు. సాహో అంత పెద్ద పాఠం నేర్పినా జాన్ కూడా భారీ బడ్జెట్ తోనే రూపొందుతోందట. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది 180 కోట్ల దాకా ప్రాధమిక అంచనాలో లెక్క తేలినట్టు వినికిడి.

నిర్మాణం పూర్తయ్యే లోగా ఇది ఇంకా పెరగొచ్చని తెలిసింది. గోపీచంద్ జిల్ తో ఆకట్టుకున్న రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ నలభై శాతం దాకా పూర్తయ్యిందని సాహో టైంలోనే న్యూస్ వచ్చింది. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో 1960ల కాలంలో జరిగిన ప్రేమ కథగా దీన్ని కొత్త తరహాలో రూపొందిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో నోస్టాల్జిక్ ఫీలింగ్ కథనం ఉంటుందట. మొత్తానికి జోనర్ ఏదైనా బడ్జెట్ విషయంలో ప్రభాస్ కానీ యువి కానీ తగ్గేలా కనిపించడం లేదు


Tags:    

Similar News