ఊహించనంత ప్రేమతో రానున్న ప్రభాస్

Update: 2019-09-03 05:50 GMT
సాహో హిట్టా ఫట్టా అనే టాక్ కాసేపు పక్కన బెడితే తెలుగు సినిమా స్థాయి - మొదటి మూడు రోజుల్లోనే రెండు వందల కోట్లు దాటే లెవల్ కు చేరుకుందనే విషయం మరోసారి రుజువయ్యింది. ఒకవేళ సాహోకి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉంటే కనక వసూళ్ళ అరాచకం ఎలా ఉండేదో ఊహకందడం కూడా కష్టమే. కాకపోతే ప్రభాస్ గత ఐదేళ్ళుగా ఒకే తరహా సూపర్ మ్యాన్ తరహా పాత్రల్లో చూసిన ప్రేక్షకులు అభిమానులు మార్పును  కోరుకుంటున్నారు.

మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి ఎంటర్ టైనర్ లో స్వీట్ లవర్ బాయ్ గా ప్రేమను పంచితే చూడాలని ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టే నెక్స్ట్ మూవీ జాన్ (వర్కింగ్ టైటిల్) రూపొందుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో నిర్మాణంలో ఉన్న ఈ మూవీకి సైతం 150 కోట్ల బడ్జెట్ ఆవుతున్నట్టు సమాచారం. ఒకవేళ నిజంగా ప్రేమ కథ అయితే ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు అనే అనుమానం రావొచ్చుగా. దానికీ క్లారిటీ ఉందట.

ఇది రొమాంటిక్ లవ్ స్టొరీ అయినప్పటికీ యూరోప్ బ్యాక్ డ్రాప్ లో 1960ల నాటి కాలంలో జరుగుతున్నట్టు చూపిస్తారట. దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఆర్ట్ వర్క్ కే కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం అవుతోందని తెలిసింది. దానికి తోడు నిజంగానే యూరోప్ లో షూటింగ్ చేస్తుండటం కూడా దీనికి ప్లస్ అవుతోంది. ఒకరకంగా చెప్పాలంటే అలనాటి మణిరత్నం గీతాంజలి స్టైల్ లో రిచ్ లవ్ ఎంటర్ టైనర్ గా రాధాకృష్ణ జాన్ ని అందించబోతున్నట్టు తెలిసింది. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లోపే షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ కి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది  యూనిట్


Tags:    

Similar News