ప్రభాస్ సినిమాల జోరు మాములుగా లేదు. మూడు రోజుల్లో రాధేశ్యామ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ సినిమా లను చేస్తూ ఏడాదికి రెండు మూడు చొప్పున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.
ఈ ఏడాదిలోనే ప్రభాస్ నటించబోతున్న మారుతి సినిమా మరియు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమాలు వస్తాయని అంటున్నారు.
కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సలార్ సినిమాకు సంబంధించిన ఒక పుకారు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటీ అంటే బాహుబలి.. కేజీఎఫ్.. పుష్ప సినిమాల తరహాలోనే సలార్ ను కూడా రెండు పార్ట్ లుగా తీసుకు వచ్చేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట. రెండు పార్ట్ ల్లో మొదటి పార్ట్ ను ఈ ఏడాది విడుదల చేయబోతున్నారు అనేది టాక్.
తాజాగా రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్ ను మీడియా వారు ఆ విషయమై ప్రశ్నించారు. అందుకు ప్రభాస్ నుండి నవ్వు సమాధానంగా వచ్చింది. ఆ వార్తలు నిజం కాకుంటే పుకార్లే అంటూ ఒక్క మాటతో తేల్చేయవచ్చు. కాని ప్రభాస్ మాత్రం ఆ మాట అనలేదు. అలా అని ప్రభాస్ రెండు పార్ట్ లుగా సినిమా రాబోతుంది అనే విషయాన్ని కూడా చెప్పలేదు.
రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్ సమయంలో సలార్ గురించిన చర్చ అనవరసం అన్నట్లుగా ఆయన భావించాడు. కాని పుకారు విషయంలో స్ఫష్టత ఇస్తే పోయేది ఏమీ లేదు. కనుక ఆయన ఒక వేళ సలార్ రెండు పార్ట్ లు పుకార్లే అయ్యి ఉంటే ఆయన పుకారు అనేవాడు. కాని పుకారు అని మాత్రం అనలేదు కనుక అది పుకారు కాకపోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో ప్రభాస్ సలార్ సినిమా గురించిన క్లారిటీ కోసం అభిమానులు మరింత గందరగోళం లో ఉన్నారు. సలార్ సినిమా రెండు పార్ట్ లుగా ఇన్నాళ్లు పుకార్లు వస్తున్న నేపథ్యంలో జనాలు పట్టించుకోలేదు.
కాని ప్రభాస్ ఈ పుకార్ల ను కొట్టి పారేయక పోవడంతో అభిమానులు ఏదో ఉంది అంటూ చర్చించుకుంటున్నారు. అంటే సలార్ ను రెండు పార్ట్ లుగా తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటూ వారు మాట్లాడుకుంటున్నారు. రాధేశ్యామ్ హడావుడి పూర్తి అయిన తర్వాత సలార్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.