ఇప్పుడు దేశమంతా బాహుబలి ది కంక్లూజన్ ట్రైలర్ గురించి తెగ మాట్లాడేసుకుంటోంది. ప్రభాస్ లుక్ గురించి.. పోరాట పటిమ గురించి కూడా జనాల్లో డిస్కషన్స్ బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు మీడియా ఇంటరాక్షన్ లలో కూడా బాగా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్.
కానీ రెండేళ్ల క్రితం బాహుబలి తొలి భాగం రిలీజ్ అయిన రోజున మాత్రం తాను షాక్ తినేశానని చెప్పాడు. బాహుబలికి మిక్సెడ్ టాక్ రావడంతో జీర్ణించుకోలేకపోయినట్లు చెప్పాడు ప్రభాస్. "నేను సహజంగా నా సినిమా రిలీజ్ రోజున ఊళ్లోనే ఉండను. కానీ బాహుబలి విషయంలో రాజమౌళి తనయుడు.. కార్తికేయ పట్టుపట్టి మరీ నన్ను హైద్రాబాద్ లో ఉంచాడు. మొదటి రోజున టాక్ చూసి మైండ్ బ్లాంక్ అయింది. హిందీ వెర్షన్ కి సూపర్బ్ టాక్ వచ్చినా.. తెలుగు వెర్షన్ కి మాత్రం ఎమోషన్స్ లేవంటూ జనాలు తేల్చేయడంతో ఏం మాట్లాడలేకపోయాను" అని చెప్పాడు ప్రభాస్.
"రాజమౌళి గత చిత్రాలతో పోల్చి చూడ్డంతోనే ఇలా జరిగింది. రెండో రోజు తర్వాత జనాలు కనెక్ట్ అయ్యారు. ఈ మూవీని విడిగా చూడ్డం మొదలుపెట్టాక అప్పుడు కోలుకున్నాను" అని చెప్పాడు ప్రభాస్. రాజమౌళి కూడా.. బాహబలి1లో జస్ట్ కేరక్టర్ ఇంట్రడక్షన్ మాత్రమే చేయడంతో ఎమోషన్స్ లేవని.. కానీ బాహుబలి ది కంక్లూజన్ లో మాత్రం తన ఫ్యాన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/