ఫ్యాన్స్ వీరాభిమానానికి అంతూ దరీ లేదు. తమ అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. ఎంతకైనా తెగించడానికి రెడీ. బాస్ సినిమా రిలీజైతే ఒకటికి పది సార్లు థియేటర్లకు వెళ్లి చూసొస్తారు. థియేటర్ల ముందు భారీ కటౌట్లు - బ్యానర్లు వేలాడదీసి సంబరాలు చేసుకుంటారు. ఇంకొందరు ఫ్యాన్స్ అయితే ఏకంగా థియేటర్ ముందు మేకపోతుల్ని - గొర్రెల్ని బలి దానం ఇస్తారు. ఆంకాలమ్మ - ముత్యాలమ్మ - పోలేరమ్మ అంటూ మొక్కుబడులు మొక్కి అభిమాన హీరో సినిమా హిట్టు కొట్టాలని పదే పదే ప్రార్థనలు చేస్తారు.
ఇటీవలి కాలంలో డాళింగ్ ప్రభాస్ అభిమానులు ఇలాంటి విషయాల్లో చాలా స్పీడుమీదున్నారు. భీమవరంలో 144 సెక్షన్ అమలయ్యిందంటే అభిమానం ఏ స్థాయికి ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు.ఏదేమైనా అదంతా వీరాభిమానం అని సరిపుచ్చుకోవాల్సిందే. అందులోకి రాజకీయాలు ప్రవేశించినప్పుడే రచ్చ రచ్చ అవుతుంది. కులరాజకీయాలు - ప్రాంత వైషమ్యాలు వచ్చినప్పుడే చిచ్చు చెలరేగుతోంది. అయితే వీటన్నిటికీ అతీతంగా మొన్నటి శుక్రవారం ప్రభాస్ పుట్టినరోజు వేడుక నాడు ప్రభాస్ అభిమానులు ప్రత్యేకించి సంబరాలు చేసుకున్నారు. తెలుగు రాష్ర్టాలతో పాటు దేశంలో నలుమూలలా ఉన్న ప్రభాస్ అభిమానులు అంగరంగ వైభవంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈసారి సంబరం మదనపల్లి అభిమానులు ప్రత్యేకం.
100అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పు ఉన్న ప్రభాస్ ఛాయాచిత్రంతో ఓ భారీ కాన్వాసును రెడీ చేశారు. సాల్ట్ ఆర్ట్ పెయింటింగ్ లో అసమానంగా ఈ పోస్టర్ ని తీర్చిదిద్దారు అభిమానులు. అమరేంద్ర బాహుబలి అంటే ఇలానే ఉంటాడేమో! అనిపించేంత బ్యూటిఫుల్ గా ఆ ఆర్ట్ ని తీర్చిదిద్దారు.