కొత్త పదాన్ని వాడిన ప్రభాస్!

Update: 2019-08-16 08:54 GMT
డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా 'సాహో' ఆగష్టు 30 న రిలీజ్ కానుంది.  దీంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈమధ్య ప్రభాస్ ముంబైలో 'సాహో' ప్రమోషన్ కోసం పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది.  అందులో ఫిలిం కంపానియన్ అనుపమ చోప్రా.. బాలీవుడ్ హంగామా వెబ్ చానెల్ వారికి కూడా ఇంటర్వ్యూలు ఇచ్చాడు.  ఈ ఇంటర్వ్యూల్లో ప్రభాస్ తో పాటు శ్రద్ధ కూడా పాల్గొంది.

బాలీవుడ్ హంగామా ఛానల్ లో ప్రభాస్ - శ్రద్ధలను ఫరిదూన్ షహర్యార్ ఇంటర్వ్యూ చేశాడు.  సాధారణ ప్రశ్నలతో పాటుగా బాహుబలితో పోలికలు.. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అన్నీ ఈ ఇంటర్వ్యూలో ఉన్నాయి. ఇవే కాకుండా  యూట్యూబ్ లో 'సాహో' ట్రైలర్ కు వచ్చిన కొన్ని కామెంట్స్ ను ప్రస్తావిస్తూ ప్రభాస్ - శ్రద్ధలను స్పందించమని కోరాడు.  ఆ కామెంట్స్ లో ఒక నెటిజన్ కామెంట్ ను చూపించాడు.

"శ్రద్ధ: నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి ప్రభాస్?

ప్రభాస్: నేను క్రియేట్ చేసిన బాహుబలి రికార్డును బద్దలు కొట్టడమే"

ఈ కామెంట్ పై స్పందన కోరగా ప్రభాస్ స్పందిస్తూ "వావ్ సూపర్బ్..అయినా అది బా..హుబలి" అని నవ్వుతూ రికార్డులు బ్రేక్ చేయడం కష్టం అనే ఉద్దేశంతో అన్నాడు.  హోస్ట్ షహర్యార్ కంటిన్యూ చేస్తూ "కానీ మొదటి రోజు రికార్డ్స్ తప్పకుండా బ్రేక్ అవుతాయి కదా.." అన్నాడు. అందుకు ప్రభాస్ "అలా జరిగితే మంచిదే.. కానీ బాహుబలి అనేది.. అదో 'షికఫ్'.."  అంటూ అరబిక్ స్టైల్ లో ఒక కొత్త పదం వాడి వెరైటీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. ఏంటో ఆ పదం గూగుల్ అంతా వెతికినా దొరకడం లేదు.  ప్రభాస్ ఉద్దేశం.. 'బాహుబలి ఓ కొండ..పగలకొట్టడానికి వీలు లేని బండ' అయి ఉండొచ్చు.  దానికి సింపుల్ గా తేల్చేశాడు.

అయితే ఈ పదం ఫసాక్ లాంటిది.. నిలదీస్ఫై లాంటిది కాదు బాబోయ్. అవి ఏం చేయాలో అర్థం కాక వాడిన పదాలు.. ఇది.. ప్రభాస్ ఇంటెన్షనల్ గా.. ఫన్నీగా వాడిన పదం.. ఆ పదం వాడినప్పుడు ప్రభాస్ ఎక్స్ ప్రెషన్ మాత్రం కేక.  ఇది మళ్ళీ ప్రభాస్ ను తక్కువ చేయడం అనుకుంటారేమో.. కాదు  కాదు.  ప్రభాస్ ఇంటర్వ్యూలో చక్కటి ఇంగ్లీష్ లో మాట్లాడాడు. ఇదేదో ఫన్ కోసం వాడిన వెరైటీ పదం.   ఒకసారి వీడియోపై ఓ లుక్కేయండి.  ఈ వీడియోలో 8.30 నిముషాలనుండి 8.45 నిముషాల వరకూ చూడండి.  సరేనా.. ఇక షికఫ్!
Full View
Tags:    

Similar News