'రాధే శ్యామ్' నుంచి ప్రభాస్ 'విక్రమాదిత్య' లుక్...!

Update: 2020-10-21 08:50 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''రాధే శ్యామ్''. రాధా కృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్‌ మరియు యూవీ క్రియేషన్స్‌ బ్యానర్స్ పై వంశీ - ప్రమోద్‌ - ప్రశీద నిర్మిస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అన్ని వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నాడని ప్రకటించిన మేకర్స్.. మరో రెండు రోజుల్లో ప్రభాస్ బర్త్ డే కానుకగా 'బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్' పేరుతో మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నారు. అయితే అంతకంటే ముందే 'రాధే శ్యామ్' నుంచి ఇవాళ మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చెప్పినట్లుగానే ఈ సినిమాలో ప్రభాస్ పాత్రని పరిచయం చేస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

'రాధే శ్యామ్' చిత్రంలో ప్రభాస్ 'విక్రమాదిత్య'గా నటిస్తున్నాడని మేకర్స్ ప్రకటించారు. ప్రభాస్ కి అడ్వాన్స్ బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఓ న్యూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ స్టైల్ గా ఓ కారు మీద కూర్చుకొని ఉన్నాడు. బ్లూ జాకెట్ ధరించి బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఇక్కడ కార్ నంబర్ ప్లేట్ పై 'ప్రభాస్' అనే ఉండటం గమనార్హం. మొత్తం మీద డార్లింగ్ బర్త్ డే ని మరింత స్పెషల్ గా సెలెబ్రేట్ చేయడానికి 'రాధే శ్యామ్' మేకర్స్ మరిన్ని సర్ప్రైజులు ప్లాన్ చేసారని తెలుస్తోంది. ఈ చిత్రంలో జగపతిబాబు - సత్యరాజ్ - భాగ్య‌శ్రీ - కునాల్ రాయ్ క‌పూర్‌ - స‌చిన్ ఖేడ్కర్‌ - ముర‌ళి శ‌ర్మ‌ - శాషా ఛ‌త్రి - ప్రియ‌ద‌ర్శి - రిద్దికుమార్‌ - స‌త్యాన్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగ్ ఇటీవలే ఇటలీలో తిరిగి ప్రారంభమైంది. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా రానున్న 'రాధే శ్యామ్'ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Tags:    

Similar News