ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టే ఉందీ సీన్. బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోటవ్వాలన్న కసితో ఏదో ఒక ప్రయత్నం చేస్తే అది కాస్తా బెడిసి కొట్టేట్టే కనిపిస్తోంది. చివరి నిమిషంలో ప్లాన్ ఫ్లాప్ అయ్యేట్టే కనిపిస్తోంది. మాయదారి కరోనా ప్లాన్స్ అన్నిటినీ బుగ్గి పాలు చేసింది. హీరో అవుదాం అనుకుంటే బదనాం చేసేసింది. ఇది ఊహించనిది. అసలు తన ప్రమేయమే లేకుండా ఇప్పుడు డెబ్యూ సినిమా రిలీజ్ ని వాయిదా వేసుకునే సన్నివేశం నెలకొంది. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అంటే.. ట్యాలెంటెడ్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించే.
ప్రదీప్ ఎన్నో హోప్స్ తో హీరో అవుతున్న సంగతి తెలిసిందే. అందుకోసం ఆరుగాలం ఎంతో శ్రమించాడు. అతడు నటించిన `30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా?` చిత్రం ఈనెల 25న రిలీజ్ కి సిద్ధమవుతోంది. అయితే ఈలోగానే కరోనా దెబ్బకు థియేటర్లను బంద్ చేయాలన్న డెసిషన్ ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 21 వరకూ థియేటర్స్ ని మూసేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ తర్వాతా ఈ బంద్ కొనసాగుతుందా లేదా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. అయితే ఆ టైమ్ కి థియేటర్స్ ఓపెన్ చేసినా.. కరోనా భయంతో జనం ఇళ్లనుంచి బయటకు వస్తారా లేదా? థియేటర్లు నిండుతాయా లేదా అన్నది చెప్పలేం. దాని ప్రభావం ఓపెనింగులపైనా దారుణంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
ఒకవేళ పోస్ట్ పోన్ చేసేసినా చిన్న సినిమాలకు ఆ తర్వాత డేట్లు ఖాళీగా లేనేలేవు. ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉంది. ముందు గొయ్యి వెనక నుయ్యి చందంగా ఉంది. పబ్లిసిటీ కూడా చెయ్యడానికి ఏమీ లేదు. పాపం ప్రదీప్ తన మొదటి సినిమాని ఎంతో ప్రేమించి చేశాడు. అందుకే కాలేజ్ లకు వెళ్లి ప్రచారం చేయాలని అనుకున్నాడు. ఇలా అనుకోగానే.. అలా రేపటి నుంచి కాలేజీలు కూడా మూసేస్తున్నారు. ప్రదీప్ కి ప్రభుత్వం కూడా వ్యతిరేకం అయిపోయింది. ఇదంతా చూస్తుంటే రాంగ్ టైమ్ లో హీరో అవుతున్నాడా? అన్న సందేహం కలుగుతోంది మరి!