ఒక్కోసారి ఒక్కో అవార్డు ఎందుకిచ్చారో ఎవ్వరికీ అర్ధంకాదు. 2009లో మగధీర సినిమాలోని నటనకు రామ్ చరణ్ ఉత్తమ నటుడు నంది పురస్కారాన్ని అందుకుంటాడని అందరూ అనుకుంటే.. మనోడు మాత్రం స్పెషల్ జ్యూరి అవార్డును అందుకున్నాడు. ఆ ఏడాది ఉత్తమ నటుడు ఎవరో తెలిసిందే. ఇప్పుడు సెక్సిణి ప్రగ్యా జైస్వాల్ కూడా అలాంటి ఫీటే కాస్త రివర్సులో చేసిందిలే.
మోడల్ గా బొంబేలో పనిచేస్తూ.. అక్కడొక చిన్నాచితకా సినిమాలో నటించిన బికినీ లేడి ప్రగ్యా.. ''మిర్చిలాంటి కుర్రాడు'' అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఏకంగా ఈ సినిమా ఒక ఏడాది లేటుగా 2015 జూలైలో రిలీజైంది. కట్ చేస్తే.. ఆ తరువాత అక్టోబర్ లో ''కంచె'' సినిమా రిలీజైంది. అంటే ''కంచె'' ఆమె రెండో సినిమా అనమాట. అందంతో అభినయంతో ప్రగ్యా బాగానే ఆకట్టుకుందిలే. సీతా దేవి పాత్రలో చాలా బ్యూటిఫుల్ గా ఉందంటూ క్రిటిక్స్ అందరూ ఆమెను పొగిడేశారు. బాగానే ఉంది. కాని ఈ రెండో సినిమాకు ఇప్పుడు ఫిలింఫేర్ వారు ''బెస్ట్ డెబ్యూ'' అవార్డును ఇచ్చారు తెలుసా!!
ఎవరన్నా మొదటి సినిమాకు ఈ డెబ్యూ అవార్డును అందిస్తారు కాని.. రెండో సినిమాకు కూడా ఇస్తారా? ఇక మొదటి సినిమాలో ప్రగ్యాను చూస్తే మాత్రం.. కమర్షియల్ సినిమాల్లో వచ్చే మసాలా హీరోయిన్ లా ప్రూవ్ చేసుకుంది కాని.. నటనలో అంత సీన్ లేదు. ఇంతకీ వీళ్ళు ఏ యాంగిల్లో రెండో సినిమాకు డెబ్యూ అవార్డు ఇచ్చారబ్బా?