ఫొటోటాక్ : ప్రగ్యా అందాల చిరు మందహాసం

Update: 2022-12-19 09:30 GMT
కంచె సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌. మొదటి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు మొదటి సినిమా లో ఈ అమ్మడి యొక్క అందం గురించి అంతా కూడా చాలా ప్రత్యేకంగా మాట్లాడుకోవడం జరిగింది. దాంతో కచ్చితంగా టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా ఈ అమ్మడు గుర్తింపు దక్కించుకోవడం ఖాయం అనుకున్నారు.

ప్రగ్యా జైస్వాల్‌ అందాల విందు ఆమెకు సక్సెస్ లను తెచ్చి పెట్టలేక పోయాయి. అందమైన ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే. పాపం ఈ అమ్మడికి తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సక్సెస్ లు దక్కలేదు. అక్కడ ఇక్కడ ఈ అమ్మడికి వస్తున్న ఆఫర్లు పెద్దగా లేకపోవడంతో కెరీర్‌ డల్ గా సాగుతోంది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా కూడా ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు దక్కుతున్న దాఖలాలు లేవు. అఖండ వంటి భారీ విజయాన్ని గత ఏడాది ఈ అమ్మడు దక్కించుకుంది. కానీ ఈమెకు దక్కిన ఆఫర్లు మాత్రం పెద్దగా ఏమీ లేవు. అయినా కూడా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఫొటోలతో ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉంది.

తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందాలతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. క్లీ వేజ్‌ షో తో పాటు థైస్ అందాలను చూపిస్తూ ఫొటోలకు ఫోజ్ ఇచ్చిన ఈ అమ్మడిని చూస్తూ నెటిజన్స్ వావ్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ అమ్మడు రెండు మూడు మీడియం రేంజ్ సినిమాల్లో నటిస్తోంది. తెలుగు లోనే కాకుండా ఇతర భాషల నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయట.

ముందు ముందు అయినా ఈ అమ్మడికి సక్సెస్ దక్కి అందాల ఆరబోతకు మంచి ఫలితం దక్కేనా అనేది చూడాలి. హీరోయిన్ గా ఈ అమ్మడి యొక్క అందాల విందు కు ఆధరణ దక్కకున్నా కూడా ఫొటో షూట్స్ తో మాత్రం మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటూ ఉంది.  




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News