ప్ర‌మాదంలో ప్ర‌కాష్ రాజ్ కెరీర్‌..ఏం జ‌రుగుతోంది?

Update: 2022-11-15 12:34 GMT
ప్ర‌కాష్ రాజ్ విల‌క్ష‌ణ పాత్ర‌ల‌కు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో కెరాఫ్ అడ్ర‌స్ గా నిలిచారు. తెలుగు, తమిళ భాష‌ల్లో విల‌క్ష‌ణ‌మైన విల‌నిజానికి స‌రికొత్త సొబ‌గుల‌ద్దిన ప్ర‌కాష్ రాజ్ కెరీర్ ప్ర‌స్తుతం ప్ర‌మాదంలో వుందా? అంటే ఆయ‌న అవునంటూ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. త‌న‌తో క‌లిసి న‌టించ‌డానికి ఇత‌ర న‌టీన‌టులు వెన‌కాడుతున్నార‌ని తాజాగా ప్ర‌కాష్ రాజ్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చనీయాంశంగా మారాయి.

వెండిదెర‌పై విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటూ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు. గ‌త కొంత కాలంగా క్రియాశీల రాజ‌కీయాల్లో చురుగ్గా పాల్గొంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌తీ అంశంపై 'జ‌స్ట్ ఆస్కింగ్‌' అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. బెంగ‌ళూరుకు చెందిన స్ర‌ముఖ పాత్రికుయురాలు గౌరీ లంకేష్ హ‌త్య త‌రువాత ప్ర‌కాష్ రాజ్ బీజేపీపై, ప్ర‌దాని న‌రేంద్ర మోదీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు.

2019లో బెంగ‌ళూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. అప్ప‌టి నుంచి మ‌రింత‌గా రాజ‌కీయాల‌పై స్పందిస్తున్నారు. ఎక్క‌డ వేదిక ల‌భించిన బీజేపీ విధానాల‌పై ప‌దునైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాను రాజ‌కీయాల‌లో చురుగ్గా పాల్గొన‌డ‌మే త‌న కెరీర్ పై ప్ర‌భావం చూపుతోంద‌ని, అదే త‌న కెరీర్ ని దెబ్బ‌తీసేలా వుంద‌ని తాజాగా ప్ర‌కాష్ రాజ్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

రీసెంట్ గా ఓ ఆంగ్ల మీడియా ఛాన‌ల్ తో ముచ్చ‌టించిన ప్ర‌కాష్ రాజ్ త‌న కెరీర్ పై రాజ‌కీయాల ప్ర‌భావం ప‌డుతున్న‌ట్టుగా అనిపిస్తోంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నేను ప్ర‌స్తుతం రాజ‌కీయ ప్ర‌భావాన్ని ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు కొంద‌రు నాతో క‌లిసి ప‌ని చేయ‌టం లేదు. నాతో క‌లిసి న‌టించొద్ద‌ని చెప్ప‌డం వ‌ల్ల కాదు. నాతో క‌లిసి ప‌నిచేస్తే వారిని అంగీక‌రించేరేమోన‌నే భ‌యం కొంత మందిలో ప‌ట్టుకుంది. అలాంటి వారంద‌రిని కోల్పోవ‌డానికి తాను సిద్ధంగా వున్నాను.

నా భ‌యం ఇంకొక‌రికి శ‌క్తిగా మార‌కూడ‌ద‌నుకుంటాను. అందుకే ఎలాంటి ప‌రిణామాలు ఎదురైనా ధైర్యంగా ముందుకె వెళ‌తాను. వాటిని స్వీక‌రించేందుకు నేను ఎప్పుడూ సిద్ధ‌మే' అంటూ ప్ర‌కాష్ రాజ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అంతే కాకుండా తాను తాజా ప‌రిణామాల‌పై విచారించ‌డం లేద‌ని, న‌ట‌న‌పైనే దృష్టి పెడుతున్నాను. నా స్వ‌రాన్ని నేను వినిపించ‌క‌పోతే కేవ‌లం నేను మంచి న‌టుడిగానే చ‌నిపోతాను' అని వ్యాఖ్యానించారు. ప్ర‌కాష్ రాజ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్ప‌డు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News