మరోసారి బేబీ బంప్ తో బాపుబొమ్మ...!

Update: 2022-05-09 10:35 GMT
కన్నడ పోకిరి సినిమా తో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్‌ తెలుగు లో ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా తో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తెలుగు లో మంచి సినిమాలు చేసినా కూడా ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాక సక్సెస్ లు స్టార్‌ డమ్‌ దక్కలేదు. దాంతో తెలుగు లో ఈమె అడపా దడపా సినిమాల్లో మాత్రమే చేసింది.

కన్నడంలో వరుసగా సినిమాలు చేస్తూ అక్కడ మీడియం రేంజ్ హీరోయిన్ గా అనిపించుకుంది. మరో వైపు తెలుగు జనాలకు బాపు బొమ్మ అనే ట్యాగ్‌ తో సుపరిచితురాలిగా నిలిచి పోయింది. అత్తారింటికి దారేది సినిమా తర్వాత ప్రణీత ఖచ్చితంగా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుని వరుసగా సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అయ్యింది. కాని అది వర్కౌట్‌ అవ్వలేదు.

తెలుగు.. కన్నడం ఇండస్ట్రీల్లో అంది వచ్చిన ఆఫర్లను అందిపుచ్చుకుంటూ కెరీర్‌ లో ముందుకు సాగుతున్న ప్రణీత ఆమద్య పెళ్లి పీఠలు ఎక్కింది. పెళ్లి చేసుకున్న ప్రణీత త్వరలో తల్లి కాబోతున్నట్లుగా ఇటీవలే ప్రకటించింది. ప్రణీత తల్లి కాబోతున్నట్లుగా ప్రకటించిన వెంటనే అంతా కూడా షాక్ అయ్యారు. హీరోయిన్ గా ఇంకా చేస్తూనే ఉన్నట్లుగా ప్రణీత ఇమేజ్ ఉంది.

ఇలాంటి సమయంలో అప్పుడే తల్లి కాబోతున్నట్లుగా చెప్పడం షాకింగ్ గా ఉందంటూ ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి జోరు కంటిన్యూ అవుతుంది.

ప్రెగ్నెంట్‌ కు ముందు ఈమె చేసే సేవా కార్యక్రమాలు మరియు హాటప్‌ ఫోటోల వల్ల మీడియాలో వార్తలతో నిలిచేది. కాని ఇప్పుడు ఈ అమ్మడు తన బేబీ బంప్‌ తో వార్తల్లో నిలిచింది.

మదర్స్ డే సందర్బంగా ప్రణీత సుభాష్ తన బేబీ బంప్‌ తో ఫోటో ను షేర్‌ చేసింది. మన కోసం మన తల్లులు ఎంతగా కష్టపడ్డారు అనే విషయాన్ని మనం తల్లులం అయితే తప్ప తెలియదు అన్నట్లుగా కామెంట్‌ పెట్టింది. ప్రణీత బేబీ బంప్‌ ఫోటో కు మంచి స్పందన వచ్చింది. గర్బంతో ఉన్న ప్రణీత మరింత అందంగా కనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
Tags:    

Similar News