స్నేహ భర్త చాలా షార్పు

Update: 2018-11-23 11:17 GMT
తెలుగులో హోమ్లీ హీరోయిన్ గా సంక్రాంతి-ప్రియమైన నీకు లాంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించిన స్నేహ గుర్తుందిగా. ఆ మధ్య సన్ అఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర భార్యగా  ఇప్పుడు వినయ విధేయ రామలో ప్రశాంత్ సతీమణిగా అడపాదడపా ఎంచుకుని మరీ పాత్రలు చేస్తోంది. ఈవిడ భర్తే ప్రసన్న. వెంటనే గుర్తుకు రాకపోవచ్చు కానీ సాయి ధరమ్ తేజ్ జవాన్ లో విలన్ గా పరిచయమయ్యింది ఇతనే. ఆ సినిమా హిట్ అయ్యుంటే కంటిన్యూ అయ్యేవాడేమో కానీ దాని రిజల్ట్ తేడా కొట్టడంతో తిరిగి కోలీవుడ్ వెళ్ళిపోయాడు. సినిమాలతో పాటు ప్రసన్న ఇటీవలే యాంకర్ గా అవతారమెత్తాడు.

సొపన సుందరి పేరుతో టెలికాస్ట్ అవుతున్న ఓ రియాలిటీ షో అది. అడ్వెంచర్లతో కూడి ఉంటుంది. దానికి స్పెషల్ గెస్ట్ గా ఇటీవలే హీరో శివ కార్తికేయన్ వచ్చాడు. బాగా సరదాగా అల్లరి అల్లరిగా సాగిపోయింది. శివ-ప్రసన్న ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఈ అంశాన్ని తీసుకుని సోషల్ మీడియా కొందరు ట్రాలింగ్ మొదలుపెట్టేసారు. విషయం ఏంటంటే శివ కార్తికేయన్ హీరోగా ఇంత పేరు తెచ్చుకోక ముందు 2011లో యాంకర్ గా చేసాడు. అప్పుడు అతను నిర్వహించిన ఒక షోకి ఆ టైంలో మంచి ఫామ్ లో ఉన్న ప్రసన్న అతిధిగా వచ్చాడు. అది బాగా సక్సెస్ అయ్యింది.

కట్ చేస్తే ఏడేళ్ల తర్వాత శివ కార్తికేయన్ స్టార్ అయిపోయి గెస్ట్ గా వస్తే ప్రసన్న యాంకర్ గా మారిపోయారు. ఇద్దరు స్టేజి మీద కలుసుకున్నారు. ఇష్యూ ఎక్కడ వచ్చింది అంటే శివ కార్తికేయన్ ప్రసన్న ఇద్దరిలో ఎవరు బెస్ట్ యాంకర్ అనే దాని గురించి. ప్రసన్న మీద తీవ్రమైన నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. దీనికి హుందాగా బదులిచ్చిన ప్రసన్న తాను మెరుగుపడడానికి ఇంకా చాలా సమయం వయసు ఉన్నాయని ఏదో ఒక రోజు ప్రూవ్ చేసుకుంటానని ఆవేశానికి పోకుండా చాలా కూల్ గా బదులిస్తున్నాడు. సోషల్ మీడియా వచ్చాక పోలికలు ఇలా హద్దులు దాటేస్తున్నాయి. ఓడలు బండ్లు అయినట్టు మొత్తానికి ఈ ఇద్దరి పాత్రలు భలే రివర్స్ అయ్యాయి కదా
   

Tags:    

Similar News