కింగ్ డమ్ ఛత్రపతి ని మించి !
మేకింగ్ లో భారీతనం.. విజయ్ క్యారెక్టర్ లో డెప్త్.. ఇంకా సినిమా స్థాయి అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి.
విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబోలో వస్తున్న సినిమాకు కింగ్ డమ్ టైటిల్ లాక్ చేశారు. టైటిల్ తో పాటు వదిలిన టీజర్ కూడ అదిరిపోయింది. భారీ స్కేల్ లో విజయ్ దేవరకొండ మాస్ స్టామినా చూపించేలా వస్తున్న ఈ కింగ్ డమ్ టీజర్ లో కథ మాత్రం ఎక్కడ రివీల్ చేయలేదు. మేకింగ్ లో భారీతనం.. విజయ్ క్యారెక్టర్ లో డెప్త్.. ఇంకా సినిమా స్థాయి అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. వీటికి తోడు ఎన్ టీ ఆర్ వాయిస్ కింగ్ డమ్ టీజర్ ని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టాయి.
ఐతే టీజర్ లో విజయ్ దేవరకొండ ఎవరు అన్న డౌట్ రాకమానదు. ఐతే ఈ సినిమా కథ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇండియా శ్రీలంక సరిహద్దుల్లో జరిగే కథ అని అంటున్నారు. తన బాల్యంలో అణచివేతకు గురైన హీరో, ఒకదశలో శరణార్థులపై క్రూరంగా ప్రవర్తించే సింహళీ సైనికుల మీద హీరో పోరాడుతాడు. ఐతే ఈ టైం లో ప్రభుత్వంతో పాటు మాఫియా కూడా హీరోకి ఎదురుతిరిగితే అప్పుడు హీరో ఏం చేశాడు అన్నది సినిమా కథ అని అంటున్నారు.
ముఖ్యంగా ఈ సినిమా సెటప్ అంతా కూడా 1947 నుంచి 40 ఇయర్స్ దాకా శ్రీలంక బోర్డర్ లో జరిగిన కథా నేపథ్యంతో తెరకెక్కించారని టాక్. ఐతే ఈ లైన్ విన్న కొందరు ప్రభాస్ ఛత్రపతి సినిమాతో పోలిక పెట్టేస్తున్నారు. ఐతే ఛత్రపతి లైన్ వేరు.. దానికి మదర్ సెంటిమెంట్ ఇంకా చాలా లేయర్స్ యాడ్ చేశారు.
కానీ కింగ్ డమ్ కథ మాత్రం అలా కాకుండా విజయ్ దేవరకొండ ఒక నాయకుడిగా ఉద్భవించి నట్టుగా గౌతం కథ రాసుకున్నాడట. వరుస ఫ్లాపులతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఆకలితో ఉన్న విజయ్ దేవరకొండకు సరైన కథతో సినిమా చేస్తున్నాడు గౌతం తిన్ననూరి. టీజర్ అదిరిపోగా బయటకు వచ్చిన కథ చూచాయగా ఇదే అయితే మాత్రం దేవరకొండ ఖాతాలో ఒక సూపర్ హిట్ పడినట్టే లెక్క.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి నిర్మాత నాగ వంశీ ఎప్పుడు చెప్పినా ఒక రేంజ్ లో అంచనాలు పెంచుతూ వచ్చాడు. ఐతే సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నామని కూడా చెప్పాడు. మరి నిన్న రిలీజైన టీజర్ చూస్తే అలాంటి ప్రస్తావన ఎక్కడ తీసుకు రాలేదు. మరి కింగ్ డమ్ రెండు భాగాలుగా వస్తుందా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.