కింగ్ డమ్ భాగ్యంకి బంపరాఫరే..!

బాలీవుడ్ లో సినిమా చేసి ఆ క్రేజ్ తో తెలుగు ఎంట్రీ ఇచ్చింది అమ్మడు.

Update: 2025-02-14 02:45 GMT

టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత ఏంటన్నది అందరికీ తెలిసిందే. ఒకటి రెండు హిట్లు పడితే చాలు వరుస ఛాన్సులు వస్తాయి. ఐతే ఒక్క ఫ్లాప్ పడితే మాత్రం మళ్లీ ఛాన్స్ లు రావాలంటే చాలా కష్టం. ఐతే ఇప్పుడు ఆ సీన్ మారింది. ఫ్లాపులు వచ్చినా కూడా కొందరికి అవకాశాలు వస్తున్నాయి. ఆ లిస్ట్ లో మొదటి వరుసలో ఉంది ముద్దుగుమ్మ భాగ్య శ్రీ బోర్స్. బాలీవుడ్ లో సినిమా చేసి ఆ క్రేజ్ తో తెలుగు ఎంట్రీ ఇచ్చింది అమ్మడు. మాస్ మహరాజ్ రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మిస్టర్ బచ్చన్ తో పరిచయమైంది భాగ్య శ్రీ. ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టినా అమ్మడికి తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.

స్టార్ హీరోయిన్ మెటీరియల్ అనిపించిన భాగ్య శ్రీ నెక్స్ట్ రాబోయే సినిమాలతో అదరగొట్టబోతుంది. ప్రస్తుతం అమ్మడు విజయ్ దేవరకొండతో కింగ్ డమ్ సినిమాలో నటిస్తుంది. గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ కాగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండ కూడా చాలా కసితో ఈ సినిమా చేసినట్టు అర్ధమవుతుంది. అలాంటి సినిమాలో హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్స్ నటిస్తుంది. కింగ్ డమ్ ఛాన్స్ అమ్మడికి నిజంగానే లక్కీ అని చెప్పొచ్చు.

గౌతం తిన్ననూరి సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు వెయిట్ ఎక్కువ ఉంటుంది. మళ్లీ రావా సినిమా లవ్ స్టోరీ అందులో ఆకాంక్ష సింగ్ కి మంచి రోల్ ఇచ్చాడు. జెర్సీలో కూడా అంతే.. ఇప్పుడు కింగ్ డమ్ విజయ్ దేవరకొండ కథ అయినా అందులో తప్పకుండా భాగ్య శ్రీకి మంచి ప్రాముఖ్యత ఉన్న రోల్ ఉంటుందని అంటున్నారు. పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్స్ అంటే కేవలం సాంగ్స్ కోసమే అన్నట్టు కాకుండా కథలో భాగం అయ్యేలా ఉండాల్సి ఉంటుంది.

కింగ్ డమ్ లో భాగ్య శ్రీ రోల్ ఎలా ఉంటుంది. ఈ సినిమా ఆమె కెరీర్ కు ఎలా హెల్ప్ అవుతుంది అన్నది చూడాలి. ఇక ఈ సినిమాతో పాటుగా దుల్కర్ సల్మాన్ కాంతతో పాటుగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ సినిమాలో కూడా అమ్మడు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలు అన్నీ వర్క్ అవుట్ అయితే మాత్రం భాగ్య శ్రీ టాప్ ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News