టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ప్రశాంత్ వర్మ ఒకరు. ఆయన ఒక్కో సినిమాకి, మరో సినిమాకు సంబంధం ఉండదు. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేసి అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాడు. మొదట యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లు చేసే ఆయన అ! సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ సినిమా తీసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఈ డైరెక్టర్ లో ఏదో మ్యాటర్ ఉంది అనే విషయం అర్థమైంది.
ఆ తర్వాత రాజశేఖర్ తో కల్కి చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు, తేజ సజ్జ లాంటి కుర్రాడితో జాంబిరెడ్డి చేసి.. తెలుగులో ఇప్పటి వరకు ఎవరూ చేయని కొత్త కోణాన్ని పరిచయం చేశాడు. ఇప్పుడు తాజాగా మళ్లీ తేజ సజ్జతో హనుమాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.
ఈరోజు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన కొత్త సినిమా హను-మాన్ కి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నాడు. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.
నిజానికి ప్రభాస్ ఆదిపురుష్ కోసం ఈ మూవీ విడుదల వాయిదా వేయడం విశేషం. అయితే, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని, అది పూర్తవ్వగానే మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
గతంలోనూ మీ టీజర్ విడుదల చేశారు. ఆ టీజర్ ని మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ తో అంచనాలు భారీగా పెరగడంతో, సినిమా విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నామని ప్రశాంత్ వర్మ చెప్పారు. త్వరలోనే ట్రైరల్ విడుదల చేస్తామని, అది కూడా కచ్చితంగా ఆకట్టుకుంటందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నిజానికి సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనిపించిందని, అందుకే, దాని కోసం సినిమాలో మరో పాత్రను చేర్చినట్లు చెప్పారు. ఆ కొత్త క్యారెక్టర్ ని పెట్టిన తర్వాత సినిమా 200శాతం పూర్తైన ఫీలింగ్ వచ్చిందని చెప్పారు.
ఇక ఈ హనుమాన్ సినిమా పూర్తిగా హనుమంతుడి కథ కాదని ఆయన చెప్పారు. హనుమంతుడి ఒక కీలక ఘట్టాన్ని మాత్రమే తీసుకున్నామని చెప్పారు. ఒక అండర్ డాగ్ లార్డ్ హనుమాన్ శక్తులను పొందుతాడు, వాటిని అతను ఎలా ఉపయోగించుకున్నాడనే విధంగా కథ సాగుతుందని ఆయన చెప్పారు.
ఇక తాను భవిష్యత్తులో 8 సూపర్ హీరోలతో సినిమా తీయాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. దాని కోసం పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. హాలీవుడ్ స్టైల్ లో ఇవి ఉంటాయని ఆయన చెప్పారు.