కొత్త పెళ్లి కూతురు.. ఐశ్వర్యపై క్రష్

Update: 2016-09-07 09:30 GMT
బాలీవుడ్ బ్యూటీ ప్రీతీ జింటా ఈ ఏడాది ప్రారంభంలో పెళ్లి చేసేకున్న సంగతి తెలిసిందే. పెళ్లయిన ఆర్నెల్ల పాటు మొగుడి ఫోటోను దాచుకుని.. అతగాడిని ఈ మధ్యనే అభిమానులకు చూపించింది. జీనీ గుడెనఫ్ అనే ఇండస్ట్రియలిస్ట్ తో చక్కగా కాపురం చేసుకుంటున్న ఈ కొత్త పెళ్లి కూతురు.. ఇప్పుడు తనకు గాళ్ క్రష్ మొదలైందని అనేస్తోంది. అది కూడా మరో బాలీవుడ్ భామ ఐశ్వర్యారాయ్ తో కావడం విశేషం.

'హేయ్ అభిషేక్ బచ్చన్.. హ్యాపీ గణేష్ చతుర్ధి. యే దిల్ హై ముష్కిల్ ప్రోమోను లూప్ లో పెట్టుకుని మళ్లీ మళ్లీ చూస్తున్నా. నాకు ఐష్ తో గాళ్ క్రష్ మొదలైందనుకుంటా' అంటూ జూనియర్ బచ్చన్ కి ట్వీట్ వేసింది. ఆ సినిమాలో ఐశ్వర్య అంత అందంగా కనిపించిందని చెప్పడం ప్రీతి జింటా ఉద్దేశ్యం అని తెలుస్తూనే ఉన్నా.. ఇలాంటి జోక్స్ కు అంతకంటే షార్ప్ గా రియాక్ట్ అవడం అభిషేక్ బచ్చన్ స్పెషాలిటీ. అందుకే ప్రీతికి 'ఓయ్.. వదిలెయ్. తను వేరొకరి సొంతం కదా' అనే అర్ధం వచ్చేలా రీట్వీట్ పెట్టాడు.

అభిషేక్ బచ్చన్ నుంచి ఈ రేంజ్ కౌంటర్ వచ్చేసరికి కొత్త పెళ్లికూతురు కాస్త తగ్గక తప్పలేదు. 'హహహా. లవ్ యూ అభిషేక్.. మనిద్దరం కలిసి చాలా కాలం అయింది' అంటూ డిస్కషన్ ని అక్కడితో క్లోజ్ చేసేసింది. ఏమైనా.. ప్రీతీ జింటా లాంటి సౌందర్య రాశినే పడగొట్టేసిందంటే.. ఐశ్వర్యారాయ్ అందం సాధారణమైనది కాదు.
Tags:    

Similar News