స‌లార్ : పృథ్వీరాజ్ ఫ‌స్ట్ లుక్.. ఫ్యాన్స్ కి పూన‌కాలే!

Update: 2022-10-16 05:09 GMT
సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ `కేజీఎఫ్‌` సిరీస్ సినిమాల‌తో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. తొలి సారి ప్ర‌భాస్ తో క‌లిసి `స‌లార్‌` పేరుతో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నాడు. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని `కేజీఎఫ్` మేక‌ర్స్ హోంబే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. `కేజీఎఫ్‌` వంటి సంచ‌ల‌న విజ‌యాల త‌రువాత ప్ర‌శాంత్ నీల్ చేస్తున్న ప్రాజెక్ట్ కావ‌డంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీకి సంబంధించిన కీల‌క స‌న్ని వేశాల చిత్రీక‌ర‌ణ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఈ మూవీ నుంచి ఆదివారం చిత్ర బృందం అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. సినిమాలోని కీల‌క పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ న‌టిస్తున్నారంటూ వార్త‌లు వినిపించాయి అయితే తన డేట్స్ స‌మ‌స్య వ‌ల్ల తాను న‌టించ‌డం లేద‌ని ఆ మ‌ధ్య పృథ్వీరాజ్ సుకుమార‌న్ ప్ర‌క‌టించాడు.

అయితే క‌రోనా కార‌ణంగా `స‌లార్‌` ప్రాజెక్ట్ ఆల‌స్యం కావ‌డంతో పృథ్వీరాజ్ సుకుమారన్ మ‌ళ్లీ ఈ ప్రాజెక్ట్ లో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. అయితే ఆయ‌న పాత్ర ఎలా వుంటుంది? ..ఇంత‌కీ త‌న‌ని ఎలాంటి మేవ‌ర్ తో ప్ర‌శాంత్ నీల్ చూపించ‌బోతున్నాడ‌న్న‌ది ప్ర‌తీ ఒక్క‌రిలో ఆస‌క్తిని రేకెత్తించ‌డం మొద‌లే పెట్టింది. ఎట్ట‌కేల‌కు ఆదివారం పృథ్వీరాజ్ సుకుమార‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా `స‌లార్‌` మేక‌ర్స్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ తో పాటు పృథ్వీరాజ్ సుకుమార‌న్ అభిమానుల‌కు స‌ర్ ప్రైజ్ ఇచ్చారు.

సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఫ‌స్ట్ లుక్ కు సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల చేసి షాకిచ్చారు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమార‌న్ వ‌ర‌ద‌రాజ మ‌న్నార్ అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. అత‌ని ఆహార్యం మ‌రింత క్రుయ‌ల్ గా క‌నిపిస్తోంది. `కేజీఎఫ్ 2`లో అధీర పాత్ర‌లో సంజ‌య్ ద‌త్ ని షాకింగ్ మేకోవ‌ర్ తో చూపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ప్ర‌శాంత్ నీల్ .. `స‌లార్‌`లోని పృథ్వీరాజ్ సుకుమార‌న్ పాత్ర కోసం కూడా అదే ఫార్ములాని ఉప‌యోగించిన‌ట్టుగా క‌నిపిస్తోంది.

ముక్కు కు రింగు, చెవుల‌కు రింగులు, మెడ‌లో మూడు క‌డాల్లాంటివి క‌నిపిస్తుండ‌గా పృథ్వీరాజ్ సుకుమార‌న్ ముఖంపై గాటు.. మాసిన గ‌డ్డం..మ‌ని కొట్టుకు పోయిన డ్రెస్ లో క‌నిపిస్తున్న తీరు తెర్రిఫిక్ గా వుంది. జ‌గ‌ప‌తిబాబు న‌టిస్తున్న రాజ‌మానార్ పాత్ర‌కు ఈ పాత్ర‌కున్న సంబంధం ఏంటీ? .. ఇంత‌కీ ఈ ఇద్ద‌రికీ `స‌లార్‌`కి వున్న క‌నెక్ష‌న్ ఏంటీ అన్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిని రేకెత్తిస్తూ ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి పూన‌కాలు తెప్పిస్తోంది.
Tags:    

Similar News