కన్ను కోట్టినందుకే కోటిచ్చేశారు..

Update: 2018-07-10 04:25 GMT
సృజనాత్మకతంగా ఏదైనా చేస్తే.. అది చరిత్రలో నిలిచిపోతుందని ప్రియా వారియర్ నిరూపించింది. క్రియేటివిటీకి హద్దులు లేవని చాటిచెప్పింది. ఒక్క కన్నుగీటి ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ మలయాళ ముద్దుగుమ్మ   వ్యాపార ప్రకటన రంగంలో కూడా కుమ్మేస్తోంది. ఇప్పటివరకు కేవలం ఒక్క చిత్రంలోనే నటించిన ఈ అందాల భామ భారీ రెమ్యూనరేషన్ కొట్టేయడం సినీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇటీవల ఓ వ్యాపార ప్రకటనలో నటించి ఊహించని పారితోషికాన్ని ప్రియా సొంతం చేసుకుంది.

ప్రముఖ కంపెనీ కోసం శుక్రవారం ఓ యాడ్ ఫిలిం షూటింగ్ లో ప్రియా పాల్గొంది. ఇందుకోసం ఆమెకు పారితోషికంగా రూ. కోటి చెల్లించారు. కొత్తగా వినోద పరిశ్రమలోకి వచ్చిన వారికి కోటి రూపాయల రెమ్యూనరేషన్ అంటే చాలా ఎక్కువ అని సదురు యాడ్ కంపెనీ తెలిపింది.

ఓరు ఆధార్ హిట్ అయ్యాక ప్రియాకు వ్యాపార ప్రకటనల్లో నటించాలని ఆఫర్లు వస్తున్నాయి. మొన్నటివరకూ రూ.7.5 లక్షలు తీసుకుంది. ఇప్పుడు ఏకంగా ఓ కంపెనీ కోటి రూపాయలు ఇవ్వడం మలయాళ ఇండస్ట్రీని కుదిపేసింది.

ఓరు ఆధార్ లవ్ చిత్రంతో జాతీయ స్థాయిలో ఫేమస్ అయిన ప్రియా వారియర్ ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందించే సింబా  చిత్రంలో రణ్ వీర్ సింగ్ సరసన నటిస్తోంది.
Tags:    

Similar News