షాట్ రెడీ అనగానే కెమెరా ముందుకు వచ్చి.. కట్ అనగానే వెళ్లిపోతారు చాలా మంది హీరోయిన్లు. కానీ.. తాను అలగ్ అంటోంది ప్రియాంక చోప్రా. నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ.. వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యింది. తాజాగా సరికొత్త పాత్రలోకి మారిపోయింది. ఇటు సినిమాలు చేస్తూనే బిజినెస్ ఉమన్ గా మారింది.
న్యూయార్క్ లో ఈ అమ్మడు స్టార్ట్ చేసిన బిజినెస్ ఏమంటే.. రెస్టారెంట్. ఈ హోటల్ ద్వారా.. ఫారెన్లో ఇండియన్ వెరైటీస్ అందుబాటులోకి తేబోతోందీ బ్యూటీ. ఈ రెస్టారెంట్ కు సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరున లేదా.. వచ్చే నెల ప్రారంభంలో ఈ రెస్టారెంట్ రిబ్బన్ కట్ చేయబోతున్నారు ప్రియాంకా జోనస్.
ఇక్కడ లభించేవి కేవలం ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే కాదు.. ఇండియన్ నేటివిటీ కూడా దొరుకుతుంది. అవును.. ఈ రెస్టారెంట్లోకి రాగానే.. భారత్ లో ఉన్న ఫీలింగ్ కలుగుతుందట. ఆ విధంగా ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నారట. మెనూకు సంబంధించి మాస్టర్ చెఫ్ హరినాయక్ చూసుకోనున్నారు. ఇంతకీ ఈమె రెస్టారెంట్ పేరేంటో తెలుసా.. ‘సోనా’. మొత్తానికి.. అటు సినిమా హీరోయిన్ గానే కాకుండా.. ఇటు బిజినెస్ ఉమన్ గా కూడా సత్తాచాటబోతున్నారు ప్రియాంక. సో.. మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.