స్టార్ హీరొయిన్ గర్భం గురించి తల్లి క్లారిటీ

Update: 2019-02-21 04:33 GMT
గత ఏడాది మోస్ట్  వాంటెడ్ సెలబ్రిటీ మ్యారేజ్ గా నిలిచిన ప్రియాంకా చోప్రా తల్లి కాబోతోందన్న వార్త గత కొద్ది రోజులుగా విపరీతంగా హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ మీడియా దీని గురించి ప్రత్యేక కథనాలు కూడా వెలువరించింది. కొద్దిరోజుల క్రితం న్యూ యార్క్ లో జరిగిన మైకేల్ కార్స్ షోలో ప్రియాంకా చోప్రా తన శరీర  తత్వానికి భిన్నంగా కడుపు కాస్త ఉబ్బినట్టు అనిపించే కాస్ట్యూమ్ లో వచ్చింది. అంతే అది గర్భమే అని నిర్ధారిస్తూ మీడియాలో రావడంతో అభిమానులు సైతం షాక్ తిన్నారు. కెరీర్ గురించి చాలా కబుర్లు చెప్పిన ప్రియాంకా ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటుందా అంటూ ఆశ్చర్యపోయారు.

ఎట్టకేలకు దానికి సంబంధించిన క్లారిటీ పిసి తల్లి మధు చోప్రా ఇచ్చేసారు. ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూతురు గర్భం గురించి వివరణ ఇచ్చింది. అసలు ప్రియాంకా చోప్రా తల్లి కాబోతోందనేది మీడియా సృష్టి తప్ప అందులో నిజం లేదని ఆ రోజు కెమెరా యాంగిల్స్ ని సెట్ చేసుకోవడం వల్ల దొర్లిన పొరపాటు వల్ల అలా కనిపించిందే తప్ప ప్రియాంకా శరీరంలో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పింది. మధు చోప్రా నిజమే చెబుతోంది అనడానికి మరో కారణం ఉంది.

పిసి ఇప్పుడు ఖాళీగా లేదు. ఓషో జీవితం ఆధారంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తున్న ఓ వైల్డ్ లైఫ్ వెబ్ మూవీలో మా ఆనంద్  షీలా పాత్ర పోషిస్తోంది. దీని షూటింగ్ లో త్వరలోనే జాయిన్ కాబోతోంది. ఇది కాకుండా షోనాలి బోస్ తీయబోయే ది స్కై ఈజ్ పింక్ లో కూడా ప్రియాంకా చోప్రాది కీలక పాత్ర. అందులో ఫర్హాన్ అక్తర్ తో పాటు దంగల్ ఫేం జైరా వాసిం ఉన్నారు. సో వీటిలో నటించేందుకు రెడీ అవుతోంది అంటే పిసి గర్భం గురించి వచ్చిన వార్తలు నిరాధారం అని తేలినట్టే


Tags:    

Similar News