వివాహం తర్వాత సెలబ్రిటీలు అయినా సామాన్యులు అయినా పిల్లల గురించి తీవ్ర ఒత్తిడులను ఎదుర్కొంటారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు ఇలాంటి సన్నివేశం ఎదురైంది. చాలా సార్లు మీడియా వేదికలపై హోస్ట్ లు ఇదే ప్రశ్నను అడిగితే .. దేవుడు ఇవ్వాలంటూ దాట వేయాల్సి వచ్చింది.
అయితే ఇంతలోనే ప్రియాంక చోప్రా సడెన్ గా శుభవార్తను తెలిపారు. నిక్ జోనాస్ తో కలిసి తాను సరోగసీలో ఆడబిడ్డకు జన్మనిచ్చానని పీసీ ప్రకటించింది. తమకు గోప్యత చాలా అవసరమని తమ కుమార్తెతో గడిపేందుకు తగిన సమయం కావాలని అన్నారు.
అయితే తాజా సమాచారం మేరకు.. ప్రియానిక్ జంట కుమార్తె ఇంకా హాస్పిటల్ లోనే ఉంది. దానికి కారణం నెలలు నిండకుండానే ఈ బిడ్డ జన్మించడమేనని తెలుస్తోంది. 12 వారాల ముందే పీసీ కుమార్తె జన్మించిందిట. కుమార్తె పుట్టిందని ఎంత సైలెంట్ గా వెల్లడించిందో పీసీ ఇప్పుడు అంతే సైలెంటుగా రెండో బిడ్డను సరోగసీలోనే ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఏప్రిల్ నెల వరకూ మొదటి బిడ్డ ఆస్పత్రిలోనే ఉంటుంది. అప్పటి వరకూ పీసీ తన షెడ్యూల్స్ ని దానికి అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పూర్తిగా పాపకే అంకితమవుతుందట.
రెండో బిడ్డను కనేందుకు పీసీ ఎగ్జయిట్ అవుతోంది. సదరన్ కాలిఫోర్నియా హాస్పిటల్ లో తొలి బిడ్డ ఉండగానే.. ప్రియానిక్ జంట ఈ ప్లాన్ ని అమల్లో పెడుతున్నారట. కానీ ఈ వార్తను ప్రియాంక చోప్రా ధృవీకరించాల్సి ఉంంది. ఇక పీసీ నటించిన మ్యాట్రిక్స్ 4 చిత్రం ఇటీవలే విడుదలై ఆకట్టుకుంది. ఈ సినిమా ఆస్కార్ అవార్డుల్లోనూ పోటీ పడుతోంది.