వివాదాస్పద భారతీయ గురూజీ ఓషో శిష్యురాలు `మా ఆనంద్ షీలా` జీవితకథతో ఓ సినిమాని తెరకెక్కించే ఆలోచన లో ఉన్నానని అమెరికా కోడలు ప్రియాంక చోప్రా (పీసీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ది ఎలెన్ షో లైవ్ లో ఈ విషయాన్ని ప్రకటించడం సంచలనమైంది.
టైటిల్ పాత్ర లో తాను నటించడమే గాక నిర్మాత గానూ పెట్టుబడులు పెడుతున్నానని పీసీ తెలిపింది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ `రెయిన్ మేన్` ఫేం బ్యారీ లెవిన్సన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. అయితే ఆదిలోనే హంసపాదు అన్న చందంగా ఈ బయోపిక్ తెరకెక్కించేందుకు వీల్లేదంటూ మా ఆనంద్ షీలా పీసీకి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఈ బయోపిక్ చేయ దలిస్తే ఆలియా కథానాయికగా నటించాలి కానీ పీసీ నటించేందుకు వీల్లేదు అంటూ హెచ్చరించారు. అలా హెచ్చరించడానికి ఓ ఆసక్తికర కారణం ఉందట. 69 ఏళ్ల షీలా యుక్త వయసులో అచ్చం ఆలియాభట్ లా ఉండేదట. అందువల్ల తన పాత్రలో ఆలియా మాత్రమే నటించాలని పట్టు బడుతోంది. అయితే ఇందులో నటించేందుకు పీసీ ఆసక్తి ని కనబరుస్తుండడంతో షీలా లీగల్ నోటీసులు పంపించారు.
మొత్తానికి వివాదాల తో అంట కాగే పని పెట్టుకుంది పీసీ. ఇప్పటికే షీలా జీవితకథతో నెట్ ఫ్లిక్స్ లో ఓ సిరీస్ సంచలనం సృష్టించంది. వైల్డ్ వైల్డ్ కంట్రీ.. అనేది టైటిల్. 69 ఏళ్ల షీలా జీవితంపై బయోపిక్ లు తీసేందుకు చాలా మంది ఆసక్తి చూపించినా ఎందుకనో పెద్ద తెర పై ఆ ప్రయత్నం కుదరలేదు. కానీ ఇప్పుడు పీసీ సాహసం చేస్తుంటే అడ్డంకులు ఎదురవుతున్నాయి. మరి ఆలియాని ఈ సినిమా కోసం ఒప్పిస్తుందా? లేదూ షీలా డిమాండ్ ని లైట్ తీస్కుని తానే నటిస్తోందా? అన్నది చూడాలి.