బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుని స్టార్ గా సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతున్న సమయంలో హాలీవుడ్ నుండి ఆఫర్లు దక్కడంతో అక్కడకు వెళ్లిన ప్రియాంక చోప్రా అక్కడ కూడా మంచి మార్కులు దక్కించుకుంది. ఒకటి కాదు రెండు కాదు వరుస సినిమాలు మరియు సిరీస్ లతో హాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అమ్మడికి గ్లోబల్ స్టార్ అంటూ గుర్తింపు దక్కింది. ఎక్కువగా విదేశాల్లో షూటింగ్స్.. షో లు.. హోస్టింగ్ లు అంటూ చక్కర్లు కొట్టే ప్రియాంక చోప్రా తాజాగా పారిస్ వెళ్లింది. అక్కడ గ్లోబల్ సిటిజన్ కాన్సర్ట్ లో పాల్గొన్నది. షో కు సంబంధించిన గ్లిమ్స్ ను ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేసుకున్న ప్రియాంక చోప్రా అక్కడి వరల్డ్ వండర్ ఈఫిల్ టవర్ వద్ద ఫొటో దిగి ఆ ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పారిస్ వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా ఈఫిల్ టవర్ వద్ద ఫొటో దిగడం చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. అందమైన సాయంకాల సమయంలో కల కన్నట్లుగా తాను ఈఫిల్ టవర్ వద్ద ఉన్నాను అంటూ సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఫొటోను అభిమానులతో షేర్ చేసుకుంది. గ్లోబల్ సిటిజన్ కాన్సర్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో స్టైలిష్ కాస్ట్యూమ్స్ లో ప్రియాంచ చోప్రా సందడి చేసింది. అంతర్జాతీయ వేదికలపై ప్రియాంక చోప్రా వేసే డ్రస్ లు ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాయి. ఆమె అత్యంత బ్యూటీఫిల్ గా కనిపించే ఔట్ ఫిట్ లో కనిపిస్తూ ఉంటుంది. తన అప్పియరెన్స్ ప్రతి సారి కూడా చాలా స్పెషల్ గా ఉండాలని కోరుకుంటూ కొత్త కొత్త డిజైన్ లను ప్రయత్నిస్తూ ఉంటుంది.
తాజాగా గ్లోబల్ సిటిజన్ కాన్సర్ట్ కోసం గ్లోబల్ స్టార్ వేసుకున్న కాస్ట్యూమ్ ఆమె అందాలను ఆరబోసే విధంగా లేవు. కాని చూడగానే వావ్ అనిపించేలా మాత్రం ఉంది. ఆమె హాజరు అయ్యే కార్యక్రమాన్ని బట్టి వేసుకునే డ్రస్ ను ఇతర విషయాలను ప్రియాంక చోప్రా పరిగణలోకి తీసుకుంటుంది. హాలీవుడ్ లో వరుసగా షో లు సినిమాలు సిరీస్ లు చేస్తున్నా కూడా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కు అందుబాటులోనే ఉంటాను అంది. మంచి కథలు తన వద్దుకు వస్తే తప్పకుండా నటించేందుకు రెడీ అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా ఈఫిల్ టవర్ వద్ద ఈమె దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరల్డ్ వండర్ ముందు గ్లోబర్ స్టార్ అందం అదరహో అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ తెగ షేర్ చేస్తున్నారు.