అఖిల్ పై అక్కినేని అభిమానులు చాలానే ఆశలు పెట్టుకున్నారు. అక్కినేని వంశం నుంచి మొదటి మెగా హీరో వచ్చాడంటూ బోలెడన్ని సంబరాలు కూడా చేసుకున్నా.. మొదటి మూవీ అఖిల్ డిజాస్టర్ కావడంతో అందరూ డీలా పడిపోయారు. రెండో సినిమా విషయంలో పక్కా ప్లానింగ్ తో కచ్చితంగా హిట్ కొట్టాలనే టార్గెట్ తో చాలా నెలలు వెయిట్ చేసి మరీ అఖిల్ ఓ సినిమాని అనౌన్స్ చేయగా.. ఇప్పుడు అది కూడా డౌట్ అంటూ ఓ రూమర్ బయల్దేరింది.
హను రాఘవపూడితో తన రెండో సినిమా అని అఖిల్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్విట్టర్ సాక్షిగా అనౌన్స్ మెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడీ ప్రాజెక్టుని పక్కన పెట్టేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకు అఖిల్ - హనుల కమిట్ మెంట్స్ కారణం అంటున్నారు. నానితో కృష్ణగాడి వీర ప్రేమగాధను.. 14 రీల్స్ ఎంటర్టెయిన్మెంట్ బ్యానర్ పై తీసిన ఈ దర్శకుడు.. తర్వాతి సినిమాని కూడా వాళ్లతోనే తీయాల్సి ఉంది. ఇదే సమయంలో అఖిల్ కూడా తన రెండో సినిమాని వేరే ప్రొడ్యూసర్ కి చేయాలి.
ప్రొడ్యూసర్ విషయంలో హీరో- దర్శకుడు ఏకాభిప్రాయానికి రాలేకపోవడం.. అవతలి వాళ్లు కూడా వెనక్కి తగ్గకపోవడంతో ఇక తప్పక ప్రాజెక్టునే క్యాన్సిల్ చేసుకున్నారన్నది లేటెస్ట్ రూమర్. ఇందులో ఎంత నిజం ఉందనే విషయం తెలియాలంటే.. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు బైట పడాల్సిందే.