పైరసీని నిలువరించడం అన్నది ఓ పెను సవాల్ గా మారిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజైన 24 గంటల్లోనే ఆన్ లైన్ టొరెంట్లలో పైరసీ లింక్ డౌన్ లోడ్ కి రెడీగా ఉంటోంది. దీని పర్యవసానం వందల వేల కోట్ల ఆదాయాన్ని నిర్మాతలు- పంపిణీ దారులు నష్టపోవాల్సి వస్తోంది. తమిళ్ రాకర్స్ సహా ఎన్నో పైరసీ మాఫియాల ఆగడాలు పెచ్చు మీరుతున్నాయే కానీ ఎవరూ తగ్గించలేకపోయారు. ప్రతిసారీ డిజిటల్ లో ఏదో ఒక కొత్త టెక్నాలజీని తేవడం ద్వారా ఈ పైరసీని అరికట్టాలని ప్రయత్నాలు చేస్తున్నా అది ఫలించడం లేదు.
అయితే ఈసారి మాత్రం అలా జరగదని.. పైరసీ ఆగడాల్ని అరికట్టే సరికొత్త టెక్నాలజీని తెచ్చామని టాలీవుడ్ నిర్మాత.. డిజిక్వెస్ట్ అధినేత బసిరెడ్డి అంటున్నారు. `డీ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్` డెమోను ఏఎంబీ సినిమాస్ లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా బసిరెడ్డి మాట్లాడుతూ.. డీ సినిమా పేరుతో ఓ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నాం. సర్వీస్ ప్రొవైడర్ల ఖర్చు కూడా తగ్గిపోతోందని వెల్లడించారు. తాజా టెక్నాలజీపై ప్రొజెక్షన్ చేయడం డిస్ట్రిబ్యూటర్- ఎగ్జిబిటర్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. కొత్త టెక్నాలజీలో పైరసీ ప్రొటెక్షన్ ఇమిడి ఉందని ఈ సమావేశంలో ప్రత్యేకించి హైలైట్ చేయడంతో ప్రస్తుతం పరిశ్రమ చూపు అటువైపు పడింది. తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్- తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్- తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కామర్స్- డిజిక్విస్ట్ ఇండియా సమాన భాగస్థులుగా దీన్ని ముందుకు తీసుకెళతామని ప్రకటించారు. కార్యక్రమంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్- తెలంగాణ ఎఫ్.డి.సి. చైర్మన్ పి.రామ్మోహన్ రావ్ తదితరులు పాల్గొని పైరసీ అంతానికి ఈ సాంకేతికత ఉపకరిస్తుందని అనడం ఆసక్తిని పెంచింది.
నిజంగానే పైరసీని నిలువరించగలరా ఈ సాంకేతికతతో? ఇప్పటికే మార్కెట్లో ఉన్న కాంపిటీటర్ కి చెక్ పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నమా ఇది? క్యూబ్- యూఎఫ్ వో వంటి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ఏళ్లకు ఏళ్లుగా మేటలు వేసి రింగ్ అయ్యారన్న ముచ్చటా నిరంతరం టాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంటుంది. మరి అన్నిటికీ చెక్ పెట్టేందుకే ఈ ప్రయత్నమా? మత్త గజాలకైనా మత్తు దించే లెవల్లో తమిళ్ రాకర్స్ మాఫియా బలపడి ఉంది. మరి వాళ్ల ముందు వీళ్ల ఆటలు సాగుతాయా? అన్నది బిగ్ క్వశ్చన్ మార్క్.